ఇందుకీ ఓవర్ యాక్షన్ : మాస్కు సరిగా పెట్టుకోలేదని తీవ్రంగా కొట్టిన పోలీసుల

ఇందుకీ ఓవర్ యాక్షన్ : మాస్కు సరిగా పెట్టుకోలేదని తీవ్రంగా కొట్టిన పోలీసుల

కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. మాస్కు ధరించని వారికి జరిమానా విధిస్తున్నారు. కొన్ని చోట్ల జైలుకు పంపుతున్నారు. ఇక కేసులు భారీగా ఉన్నచోట లాక్ డౌన్ విధిస్తున్నారు. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ లో మాస్కు సరిగా పెట్టుకొని వ్యక్తిని పోలీసులు చితకబాదారు.

ఇండోర్ సిటీలో మంగళవారం మధ్యాహ్నం ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మాస్కు సరిగా బాధించకుండా రోడ్డుపై వెళ్తున్నాడు. అతడిని గమనించిన పోలీసులు అక్కడే ఆపారు. మాస్కు పెట్టుకోలేదని రోడ్డుపై పడేసి చితకబాదారు. కాగా సదరు వ్యక్తి ఆ సమయంలో ఆసుపత్రిలో ఉన్న తమ బంధువుల దగ్గరకు వెళ్తున్నాడు. పక్కన ఉన్న అతడి బంధువులు ఆసుపత్రికి వెళ్తున్నామని చెప్పిన కూడా వినకుండా పోలీసులు అతడిపై దాడి చేశారు.

మెడపై కలువేసి అదిమారు. దీనిని గమనించిన కొందరు యువకుడు సెల్ ఫోన్ లో బంధించారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. సదరు వ్యక్తిని కొట్టిన ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు. అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు