కొత్త విమానంలో మొదటిసారి తిరుమల వస్తున్న రాష్ట్రపతి

మొదటి పర్యటనను తిరుమల వెంకన్న దర్శనం కోసం.. అందులో ప్రయాణిస్తున్నారు.

భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింగ్ తిరుమల పర్యటన వెనక విశేషం ఉంది.. ఇటీవల భారతదేశం కొత్తగా మూడు విమానాలు కొనుగోలు చేసింది. అమెరికా తరహాలో ఎయిర్ ఇండియా వన్ పేరుతో వీటిని ప్రముఖులు ఉపయోగిస్తున్నారు. ఇందులో ఓ విమానం రాష్ట్రపతి అధికారిక పర్యటనలకు ఉపయోగిస్తారు.

ఎయిర్ ఇండియా వన్ – బోయింగ్ 777గా దీన్ని పిలుస్తారు. ఈ విమానాన్ని మొదటిసారి ఉపయోగిస్తున్న సందర్భంగా.. మొదటి పర్యటనను తిరుమల వెంకన్న దర్శనం కోసం.. అందులో ప్రయాణిస్తున్నారు. ఢిల్లీలో విమానం ఎక్కేముందు పూజలు కూడా చేశారు రాష్ట్రపతి దంపతులు. విమానంలోని సిబ్బందితో కలిసి ఫొటో దిగారు.

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తున్న రాష్ట్రపతికి ఏపీ గర్నవర్, సీఎం స్వాగతం రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల చేరుకుని స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు