కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర తగ్గింపు.. రూ.300కే ఇస్తామని ప్రకటన.. రాష్ట్రాల నుంచి 34 కోట్ల డోసుల ఆర్డర్

కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర తగ్గింపు.. రూ.300కే ఇస్తామని ప్రకటన.. రాష్ట్రాల నుంచి 34 కోట్ల డోసుల ఆర్డర్

kovisheld vaccine
kovisheld vaccine

దేశంలో కరోనా విలయాన్ని కట్టడి చేయటానికి.. ప్రజలను కరోనా నుంచి రక్షించటానికి ఇస్తున్న వ్యాక్సిన్ ధరను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది సీరం సంస్థ. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోసు 400 రూపాయలకు ఇస్తామని మొదట్లో చెప్పిన సీరం కంపెనీ.. ఇప్పుడు ఆ ధరను 300 రూపాయలకు తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు రెండు డోసులకు కలిపి 600 రూపాయలకే ఇస్తామని ప్రకటించింది సంస్థ.

ఇప్పటికే సీరం కంపెనీకి.. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఆర్డర్స్ వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు 34 కోట్ల డోసులకు ఆర్డర్ ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వం వాటా అదనం. రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితం వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించిన క్రమంలో.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక భారం తగ్గించటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది కంపెనీ.

ఇక దేశంలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు 2 కోట్ల డోసులకు ఆర్డర్ ఇచ్చాయి. వీటి ధరలో ప్రస్తుతానికి మార్పు లేదని చెప్పింది. ప్రైవేట్ ఆస్పత్రులకు ఇచ్చే ఒక్క డోసు ధరను 600 రూపాయలుగా నిర్ణయించింది కంపెనీ. ఈ ధరను కొనసాగిస్తామని.. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే వ్యాక్సిన్ ధరను మాత్రమే 100 రూపాయలు తగ్గించినట్లు కంపెనీలు స్పష్టం చేసింది.

దేశంలోనే మరో వ్యాక్సిన్ తయారీ సంస్థ అయిన.. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్ ధర మాత్రం ప్రభుత్వాలకు 600 రూపాయలకు విక్రయిస్తుంది. ప్రైవేట్ ఆస్పత్రులకు ఒక్కో డోసు 12 వందలకు అమ్ముతుంది. కోవిషీల్డ్ కంటే ఈ ధర ఏకంగా 120 శాతం అదనం..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు