బీజేపీలోకి పీటీ ఉష

దేశంలో భారతీయ జనతాపార్టీ రోజు రోజుకు బలపడుతుంది. గతంలో మతతత్వ పార్టీగా ముద్రవేసుకున్న బీజేపీ ఇప్పుడు అన్ని మతాల రాజకీయనాయకులకు ప్రాధాన్యం ఇస్తుంది. దింతో ఈ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. గత కొంత కాలంగా బీజేపీలోకి భారీగా వలసలు పెరిగాయి. దేశంలో ఇతర పార్టీలు బలంగా లేకపోవడంతో అందరి చూపు బీజేపీపైనే పడింది.. ఇక అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయంటే బీజేపీలోకి క్యూ కట్టే వారి సంఖ్య అమాంతం పెరిగిపోతుంది. తాజాగా పశ్చిమ బెంగాల్ లో తృణముల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చాలామంది బడా నేతలు వచ్చారు. తృణమూల్ లో మమతా తర్వాత బలమైన నేతగా ఉన్న సువెందు అధికారితోపాటు మరికొందరు బీజేపీలో చేరారు.

ఇక కేరళలో కూడా బీజేపీ బలపడుతుంది. కమ్యూనిస్ట్ పరిపాలనలో ఉన్న కేరళలో గత కొంత కాలంగా కాషాయం చిగురిస్తుంది. గతంలో ఇక్కడ కాషాయపార్టీ అభివృద్ధి చెందకుండా కమ్యూనిస్ట్ నేతలు అడ్డుకట్ట వేశారు. మతతత్వ పార్టీ అని ముద్ర వేసి ఇతర ధర్మాలు ఆచరిస్తున్న వారిని బీజేపీకి దూరం చేశారు. రాను రాను బీజేపీ మతతత్వ ముద్రను చెడుపుకుంటూ వస్తుంది. ముస్లిం మైనారిటీలకు సముచిత స్థానం కల్పిస్తుంది. దింతో ముస్లిం మైనారిటీలు, క్రైస్తవులు పెద్ద సంఖ్యలో బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు.

ఇదిలా ఉంటే పరుగుల రాణి పీటీ ఉష త్వరలో బీజేపీలో చేరనున్నారు. కేరళకు చెందిన ఉష ప్రస్తుతం ఓ కోచింగ్ సెంటర్ నడుపుతున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె బీజేపీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. త్వరలో కేరళలో బీజేపీ ఓ యాత్రను ప్రారంభించనుంది. ఈ యాత్ర ప్రారంభోత్సవానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో ఈమె బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. ఈమెతోపాటు మెట్రో మన్ శ్రీధరన్ కూడా బీజేపీలో చేరనున్నారు. కేరళలో ఇప్పుడిప్పుడే చిగురిస్తున్నా బీజేపీకి ఈ ఇద్దరి రాక శుభపరిణామం అని చెప్పాలి

ఇక శ్రీధరన్ బీజేపీలో చేరే దానిపై స్పష్టత ఇచ్చారు. తాను త్వరలో బీజేపీలో చేరుతానని ప్రకటించారు. కేరళలో బీజేపీ అధికారంలోకి రావడం అవసరమని, అధికారంలోకి తీసుకురావడానికి తాను ప్రయత్నిస్తానని తెలిపారు. ఈ వయసులో రాజకీయాల్లోకి రావలసిన అవసరం తనకు లేదని, కేవలం బీజేపీని కేరళలో అధికారంలోకి తీసుకొచ్చేందుకే తాను బీజేపీలో చేరానని వివరించారు. మీరు సీఎం అభ్యర్థిగా ఉంటారా? అని విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. అధికారం తీసుకొచ్చిన తర్వాత సీఎం ఎవరైనా తనకు ఇష్టమే అని.. తనకు పదవుల మీద ఆశ లేదని స్పష్టం చేశారు.

బీజేపీలోకి పీటీ ఉష

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు