సీఎం ఇంట్లోకి వరద నీరు – బిల్డింగ్ పైకి ఎక్కిన లీడర్

సీఎం ఇంట్లోకి వరద నీరు - బిల్డింగ్ పైకి ఎక్కిన లీడర్ : అంతస్తుకి వెళ్లిపోయారు. ఇంట్లోని వస్తువులు అన్నీ తడిసిపోయినట్లు తెలిపారు అధికారులు. 26వ తేదీ సాయంత్రం వరకు

తీరం దాటిన నివర్ తుఫాన్ వర్ష బీభత్సాన్ని సృష్టించింది. 25వ తేదీ అర్థరాత్రి తీరం దాటగా.. చెన్నై సిటీతోపాటు పుదుచ్చేరి రాష్ట్రంలో కొన్ని గంటలపాటు కుండపోత వర్షం పడింది. రోడ్లు జలమయం అయ్యాయి. వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహించాయి. కొన్ని ఇళ్లు కూలిపోయాయి. చెట్లు నేలను తాకాయి. వీధుల్లో మోకాలులోతు నీళ్లు ప్రవహించాయి.

పుదుచ్చేరిలో 24 గంటల్లోనే 24 సెంటీమీటర్ల వర్షం నమోదు అయ్యింది. రోజంతా భారీ వర్షం పడడటంతో.. అనేక ప్రాంతాలు నీట మునిగాయి.

పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి ఇంట్లోకి కూడా నీళ్లు వచ్చాయి.

వెంటనే ఆయన గ్రౌండ్ ఫ్లోర్ వదిలి.. పై అంతస్తుకి వెళ్లిపోయారు. ఇంట్లోని వస్తువులు అన్నీ తడిసిపోయినట్లు తెలిపారు అధికారులు. 26వ తేదీ సాయంత్రం వరకు భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో అందరూ ఇళ్లల్లోనే ఉండిపోయారు.

నివర్ తుఫాన్ తీరం దాటే సమయంలో 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. అతి తీవ్ర తుఫాన్ గా ఉన్న నివర్.. తీరం దాటే సమయంలో కొంచెం శాంతించి.. తీవ్ర తుపాన్ గా బలహీన పడటంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు