ఢిల్లీని ముట్టడించిన రైతులపై విరుచుకుపడిన పోలీసులు

ఢిల్లీని ముట్టడించిన రైతులపై విరుచుకుపడిన పోలీసులు.. లాఠీఛార్జితో చెదరగొట్టారు. పోలీసుల దాడులతో మరింత రెచ్చిపోయిన రైతులు.. బారికేడ్లు, వాటర్ గగ్గర్ లను యమునా నదిలో ఎత్తిపడేశారు. పంజాబ్

punjab farmers protest in delhi

రైతు వ్యతిరేకంగా ఉన్న వ్యవసాయ బిల్లులకు నిరసనగా ఢిల్లీని ముట్టడించారు పంజాబ్ రైతులు. లక్షలాది మంది రైతులు లారీలు, ట్రాక్టర్లలో ఢిల్లీకి వచ్చారు. అంతకంతకూ పెరుగుతున్న రైతులతో.. హర్యానా సరిహద్దుల్లో అడ్డుకున్నారు. ఢిల్లీ సరిహద్దులు సైతం మూసివేశారు. రైతు అంటే చాలు రాజధానిలోకి రాకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి నిలిపివేశారు.

నిర్బంధాలను దాటుకుని ఢిల్లీ చేరిన రైతులు పార్లమెంట్ ముట్టడికి వెళ్లారు. మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు.. రైతులపై వాటర్ కెనాన్లతో విరుచుకుపడ్డారు.

లాఠీఛార్జితో చెదరగొట్టారు. పోలీసుల దాడులతో మరింత రెచ్చిపోయిన రైతులు.. బారికేడ్లు, వాటర్ గగ్గర్ లను యమునా నదిలో ఎత్తిపడేశారు.

పంజాబ్ నుంచి వస్తున్న రైతులను మధ్యలోనే ఎక్కడికక్కడ అడ్డుకుని చెదరగొట్టారు.

మోడీ ప్రభుత్వం మూడు వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చింది. దీని వల్ల రైతు పండించిన పంటకు మద్దతు ధర ఉండదు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు రద్దు అవుతాయి. తమ పంటను ఎక్కడైనా అమ్ముకునే వెసలుబాటు ఉంటుంది. ఈ బిల్లుల వల్ల కార్పొరేట్ మాఫియా చేతుల్లోకి వ్యవసాయం వెళ్లిపోతుందని.. పంటకు గిట్టుబాటు ధర లభించదని పంజాబ్ రైతులు మూడు నెలలుగా ఆందోళన చేస్తున్నారు. అయినా మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గటం లేదు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు