రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్

rahul gandhi tessted covid postive

కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. ఏప్రిల్ 20వ తేదీ మంగళవారం మధ్యాహ్నం వచ్చిన రిపోర్ట్ లో పాజిటివ్ అని స్పష్టం కావటంతో.. వెంటనే హోం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయాడు.

లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని.. ప్రస్తుతానికి ఇంట్లోనే ఉంచి చికిత్స తీసుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రాహుల్ వయస్సు 50 సంవత్సరాలు. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్న డాక్టర్ల సూచనతో.. వారం రోజులుగా తనతో కాంటాక్ట్ అయిన అందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు రాహుల్ గాంధీ.

ఏప్రిల్ 14వ తేదీ పశ్చిమబెంగాల్ లోని ఉత్తర దినజ్ పూర్ జిల్లాలోని ఎన్నికల ర్యాలీ, సభల్లో పాల్గొన్నారు. కరోనా తీవ్రంగా ఉన్న క్రమంలో.. ఏప్రిల్ 14వ తేదీ రాత్రి ఎన్నికల ర్యాలీలు, సభలను పూర్తిగా రద్దు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఏ పార్టీ రాజకీయ సభలు నిర్వహించొద్దని పిలుపునిచ్చారు.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు