రాజకీయ ప్రచారం నేను ఆపేస్తా.. మీరు సిద్ధమా.. మోడీ, అమిత్ షాకు సవాల్

rahul gandhi challenges narendramodi and amitshah

రాజకీయాల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం.. ఓటు వేసి అధికారం ఇచ్చే జనం ప్రాణాలు ఇప్పుడు ముఖ్యం.. ప్రజల బాగోగుల ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకేం కావాలి.. ఏ రాజకీయ పార్టీకి అయినా ఇదే కదా ముఖ్యం.. అందుకే నేను చెబుతున్నా.. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారాన్ని నేను ఆపేస్తాను.. సభలు, ర్యాలీలు, సమావేశాలు అన్నింటినీ ఆపేస్తాను.. కేవలం మీడియా, సోషల్ మీడియా ద్వారానే ప్రచారం చేద్దాం.. ఇందుకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా..

ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ. దేశంలో కరోనా తీవ్రస్థాయిలో ఉందని కేంద్ర ప్రభుత్వమే చెబుతోంది. రోజురోజుకు పెరుగుతుందని.. జనం చచ్చిపోతున్నారని మీరే చెబుతున్నారు.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను.. రాజకీయాల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం.. మీరు సిద్ధం అయితే నేను సిద్ధం అంటూ ప్రధానమంత్రి మోడీ, అమిత్ షాలకు కోరారు రాహుల్ గాంధీ.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ర్యాలీలు, సభలు, సమావేశాలు పెట్టి కరోనా వ్యాప్తికి రాజకీయ పార్టీలు కారణం కాకూడదు.. ఇప్పటికైనా మించిపోయింది లేదు.. ఒక్క బీజేపీనే కాదు.. మిగతా అన్ని పార్టీలు దీనికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

పశ్చిమబెంగాల్ లో మరో మూడు విడతల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ప్రజల ప్రాణాలు, హెల్త్ ఎమర్జన్సీని దృష్టిలో పెట్టుకుని ఈ పిలుపునిస్తున్నాను అంటూ ప్రకటించారు రాహుల్ గాంధీ. తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, బీజేపీ, కాంగ్రెస్ ఇతర రాజకీయ పార్టీలు అన్నీ ఒక్కతాటిపైకి వచ్చి దేశంలోని అన్ని ఎన్నికల ప్రచారాలను నిలిపివేయాలని కోరారు రాహుల్ గాంధీ.

దీనికి బీజేపీ ఏం సమాధానం చెబుతుందో చూడాలి. కరోనా విజృంభిస్తున్న సమయంలోనే లక్షల మందితో సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించటం ఎంత వరకు సబబో.. దీన్ని బీజేపీ ఎలా సమర్ధించుకుంటుందో చూడాలి.. ప్రజల ప్రాణాల కంటే రాజకీయాలే ముఖ్యం అంటుందా లేకపోతే.. ఏమంటుందో చూడాలి.. ఓడిపోయే కాంగ్రెస్ ఏమైనా చెబుతుంది అంటూ రొటీన్ పొలిటికల్ డైలాగ్ పేల్చుతుందో చూడాలి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు