కరోనాపై మరో యుద్ధం : రైలు బోగీలను రెడీ చేస్తున్న ప్రభుత్వం – ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ 80 శాతం బెడ్స్ కరోనాకే

కరోనాపై మరో యుద్ధం.. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ 80 శాతం బెడ్స్ కరోనాకే.. రైలు బోగీలు రెడీ చేస్తున్నారు

కరోనా కట్టడిపై మరోసారి యుద్ధం చేయాలని.. అందరూ అందరూ సిద్ధం కావాలని.. అన్ని పరిస్థితులను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది కేంద్రం.

ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లోని 80 శాతం బెడ్స్ కరోనా పేషెంట్లకు సిద్ధం చేయాలని.. ఎవరు వచ్చినా బెడ్స్ లేవు అనే సమాధానం రావొద్దని ఆదేశించింది. కరోనా చికిత్సకు కావాల్సిన మందులు, మాస్క్ లు, శానిటైజర్లు సిద్ధం చేసుకోవాలని.. కరోనాపై మరోసారి యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైందని స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది.

ఆస్పత్రుల్లో బెడ్స్ సరిపోవని కొన్ని రాష్ట్రాలు కేంద్రానికి సూచించగా.. రైలు బోగీలను వాడుకోవాలని.. అందుకు సంబంధించి ఇప్పటికే రైల్వే శాఖకు సమాచారం ఇచ్చామని స్పష్టం చేసింది. ప్రతి రైల్వే జోన్ లో.. 2 వేల బెర్త్ లను కరోనా పేషెంట్ల చికిత్స కోసం సిద్ధం చేసుకోవాలని సూచించింది కేంద్రం.

ఆస్పత్రులతోపాటు.. రైలు బోగీలను సిద్ధం చేయాలన్న కేంద్రం ఆదేశాలకు రైల్వే శాఖ స్పందించింది. ఢిల్లీ పరిధిలో 4 వేల రైలు బెడ్స్ సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. మిగతా రాష్ట్రాలు డిమాండ్ చేస్తే.. అందుకు తగ్గట్టు సిద్ధం చేస్తామని స్పష్టం చేసింది రైల్వే శాఖ. రైల్వే ఆస్పత్రుల్లోని డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది సైతం కరోనా పేషెంట్లకు చికిత్స అందించటానికి సిద్ధంగా ఉన్నారని కేంద్రానికి నివేదిక ఇచ్చింది రైల్వే శాఖ

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు