అపోలో ఆస్పత్రిలో చేరిన రజినీకాంత్

అపోలో ఆస్పత్రిలో చేరిన రజినీకాంత్.. నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని.. కరోనా లేదని.. అయినా...

rajinikanth join apollo hospital in hyderabad
rajinikanth join apollo hospital in hyderabad

సూపర్ స్టార్ రజినీకాంత్ తీవ్ర అనారోగ్యంతో.. హైదరాబాద్ జూబ్సీహిల్స్ లోని ఆస్పత్రిలో శుక్రవారం జాయిన్ అయ్యారు. అన్నాత్తే సినిమా షూటింగ్ లో భాగంగా కొన్ని రోజులుగా రజినీకాంత్ ఫిల్మ్ సిటీలోని షూటింగ్ లో ఉన్నారు.

మూడు రోజుల క్రితం యూనిట్ లోని ఏడుగురికి కరోనా పాజిటివ్ రావటంతో.. షూటింగ్ వాయిదా పడటంతోపాటు.. ఆయన ఫిల్మ్ సిటీలోనే ఐసోలేషన్ లో ఉన్నారు. గురువారం రాత్రి తీవ్ర ఆయాసం రావటంతోపాటు బీపీ పెరగటంతో.. వెంటనే జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి వచ్చారు.

ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో ఇన్ పేషెంట్ గా చికిత్స తీసుకుంటున్నారు. 22వ తేదీని చేసిన కరోనా పరీక్షలో నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని.. కరోనా లేదని ఆస్పత్రి ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసింది.

రజినీకాంత్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారనే విషయం తెలిసిన వెంటనే.. చెన్నైలోని కుటుంబ సభ్యులు హైదరాబాద్ బయలుదేరి వచ్చారు. అపోలోలోని ప్రత్యేక వైద్య బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు