తుస్ అనిపించిన రజినీకాంత్ – నిర్ణయం మళ్లీ వాయిదా

తుస్ అనిపించిన రజినీకాంత్ - నిర్ణయం మళ్లీ వాయిదా.. ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటంపై కార్యకర్తలు, అభిమానుల్లోనే నిరుత్సాహం ఏర్పడింది. మీడియా సైతం తుస్ రజినీకాంత్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Rajinikanth may again skip any major political announcement
Rajinikanth may again skip any major political announcement

ఏదో జరిగిపోతుంది.. తమిళనాడు రాజకీయాలు కీలక మలుపు తిరగబోతున్నాయి.. కొత్త చరిత్రకు నాంది పలకబోతున్నారు తలైవా రజినీకాంత్ అంటూ రెండు రోజులగా ఒకటే గోల.. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయా జిల్లా పార్టీ అధ్యక్షులు 30 మందితో చెన్నైలో భేటీ అయ్యాయి.

పార్టీ అధ్యక్షుల అభిప్రాయాలు తీసుకున్నారు. అందరికీ ఒకటే మాట.. పార్టీ ప్రారంభించి మూడేళ్లు అయ్యింది.. ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే ఎలా.. 2021 ఎన్నికలు అతి త్వరలోనే ఉన్నాయి.. ఇప్పటికే ఆలస్యం అయ్యింది.. రాజకీయ నిర్ణయం తీసుకోండి.. పోటీ చేస్తున్నామా లేదా.. పార్టీ ఉంటుందా లేదా.. ఎవరితో అయినా పొత్తు ఉంటుందా లేదా అనేది స్పష్టం చేయాలని అందరూ ముక్తకంఠంతో కోరారు.

దీనిపై రజినీకాంత్ ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. అతి త్వరలోనే కిలక ప్రకటన వస్తుందని స్పష్టం చేశారు.
త్వరలోనే నిర్ణయం తీసుకుని అందరికీ తెలియజేస్తానని స్పష్టం చేశారు. ఎప్పటిలాగే సమావేశం నుంచి అభిప్రాయాలు తీసుకుని వెళ్లిపోయారు.

ఏదో చేస్తారని.. ఏదో జరగబోతుంది అనుకున్న తమిళనాడు ప్రజలకు తుస్ అనిపించారు రజినీకాంత్.
ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్లు.. ఒక్క మాట కూడా మూడేళ్లుగా మాట్లాడటం లేదని.. పార్టీ ఎందుకు పెట్టారు అని అంటున్నారు కార్యకర్తలు.

ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటంపై కార్యకర్తలు, అభిమానుల్లోనే నిరుత్సాహం ఏర్పడింది.
మీడియా సైతం తుస్ రజినీకాంత్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇప్పటికే భారీ ఆలస్యం అయ్యింది.. ఇప్పుడు కూడా అతి త్వరలో అని చెప్పటం చూస్తుంటే రాజకీయ పార్టీగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేనట్లే అంటోంది తమిళనాడు మీడియా.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు