కోవాగ్జిన్ ధర గిట్టుబాటు కావటం లేదు.. రూ.150కి ఇవ్వలేమంటూ భారత్ బయోటెక్ అల్టిమేటం..

కోవాగ్జిన్ ధర గిట్టుబాటు కావటం లేదు.. రూ.150కి ఇవ్వలేమంటూ భారత్ బయోటెక్ అల్టిమేటం..

కోవాగ్జిన్ ధర గిట్టుబాటు కావటం లేదు.. రూ.150కి ఇవ్వలేమంటూ భారత్ బయోటెక్ అల్టిమేటం..

కోవాగ్జిన్ వ్యాక్సిన్ ధరలు భారీగా పెరగనున్నాయి.. ఈ విషయాన్ని ఆ సంస్థ స్వయంగా ప్రకటించేసింది. వ్యాక్సిన్ తయారీకి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని.. దీన్ని రాబట్టుకోవటానికి ధరలు పెంచక తప్పదని స్పష్టం చేసింది ఆ సంస్థ. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి 2021, జూన్ 15వ తేదీన అల్టిమేటం ఇచ్చేసింది కూడా.

కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఒక్కో డోసును 150 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వానికి ఇస్తుంది సంస్థ. ఈ ధర గిట్టుబాటు కావటం లేదని స్పష్టం చేస్తూ లేఖ రాసింది. రాబోయే రోజుల్లో ధరను పెంచాలని సూచించింది. అలా కాకపోతే.. 150 రూపాయలకు ఇవ్వటం సాధ్యం కాదని తేల్చేసింది కోవాగ్జిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్

బహిరంగ మార్కెట్ లో ఒక్కో కోవాగ్జిన్ ధర 1,425 రూపాయలుగా ఉంది. విదేశీ వ్యాక్సిన్లతో పోల్చి చూసినా కోవాగ్జిన్ ధర అన్నింటిక కంటే ఎక్కవగానే ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వానికి మాత్రం 150 రూపాయలకు అందజేస్తుంది. ఈ ధరతో ఎక్కువ రోజులు ఇవ్వలేం అని స్పష్టం చేసింది సంస్థ. ఒక్కో డోసు కనీసం 300 రూపాయలు అయినా ఉండాలని స్పష్టం చేసింది.

కోవాగ్జిన్ వ్యాక్సిన్ తయారీకి 500 కోట్ల రూపాయల సొంత నిధులు ఖర్చు చేశామని.. 150 రూపాయలకు ప్రభుత్వానికి ఇవ్వటం ద్వారా నష్టపోతున్నామని వెల్లడించింది. వ్యాక్సిన్ ధరను కనీసం డబుల్ చేయాలని.. బహిరంగ మార్కెట్ కు కేటాయిస్తున్న 25 శాతాన్ని సైతం పెంచాలని సూచించింది. తద్వారానే పెట్టిన పెట్టుబడి రాబట్టుకోవటం జరుగుతుందని వివరించింది సంస్థ.

విదేశాలతో పోల్చితే కోవిడ్ వ్యాక్సిన్ ధరలు భారతదేశంలోనే తక్కువగా ఉన్నాయని.. విదేశాల్లో ఒక్కో డోసు కనీసం 750 రూపాయలుగా ఉంటే.. అత్యధికంగా 2 వేల 700 రూపాయలు ఉందని స్పష్టం చేసింది. భారతదేశంలోనే ఒక్కో డోసును 150 రూపాయలకే ఇస్తున్నామని.. ప్రైవేట్ మార్కెట్ లో 1,450 రూపాయలుగానే ఉందని వివరించింది సంస్థ.

ఒక్క విషయాన్ని ప్రజలు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే.. భారతదేశంలో పేదలు 80 శాతం మంది.. వారి తలసరి ఆదాయం బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక కంటే తక్కువగా ఉంది. భూ మండలంపై 30 శాతం జనం మన దేశంలోనే ఉన్నారు. ఒక్క భారత్ లోనే 270 కోట్ల డోసులు అవసరం ఉంది.. ఈ ఒక్క ఏడాదిలోనే..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు