ఆదానీ ఆస్ట్రేలియా వ్యాపారానికి.. మన SBI వేల కోట్ల అప్పు ఇస్తుంది

సిడ్నీలో జరుగుతున్న ఇండియా - ఆసీస్ వన్డే మ్యాచ్ ద్వారా ఇది మరోసారి రుజువు అయ్యింది. అది ఆస్ట్రేలియా కదా.. వాళ్లకు కొంచెం

SBI $ 1 BN loan to Adani's controversial
ఆదానీ ఆస్ట్రేలియా వ్యాపారానికి.. మన SBI వేల కోట్ల అప్పు ఇస్తుంది

ఆదానీ అంటే ఎవరూ.. అంబానీ తర్వాత.. భారతదేశంలోనే ఏడేళ్లలో నెంబర్ వన్ బిజినెస్ టైకూన్ గా ఎదిగిన వ్యక్తి. ఆదానీ గ్రూప్ ఎంట్రీ ఇచ్చింది అంటే చాలు అది వాళ్లకు దక్కాల్సిందే. ఇది ఇండియాలో సిట్యువేషన్ కాదు.. ఆస్ట్రేలియాలోనూ ఆదానీ హవా నడుస్తోంది. సిడ్నీలో జరుగుతున్న ఇండియా – ఆసీస్ వన్డే మ్యాచ్ ద్వారా ఇది మరోసారి రుజువు అయ్యింది. అది ఆస్ట్రేలియా కదా.. వాళ్లకు కొంచెం పర్యావరణంపై ఆసక్తి ఉంటుంది.

ఆస్ట్రేలియా దేశంలోని క్వీన్స్ ల్యాండ్ లో ఆదానీ గ్రూప్ బొగ్గు గనుల తవ్వకం చేపట్టింది. దీని వల్ల పర్యావరణం సమస్యలు వస్తాయని స్థానికులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పోరాటాలు చేస్తున్నారు. ఆదానీ ప్రాజెక్ట్ కోసం మన దేశంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7 వేల కోట్ల రూపాయలు అప్పు ఇస్తుంది. ఈ అప్పును SBI ఇవ్వొద్దు అంటూ క్వీన్స్ ల్యాండ్ ప్రాజెక్టను వ్యతిరేకిస్తున్న నిరసనకారులు క్రికెట్ స్టేడియోలో ప్లకార్డులతో నిరసన తెలిపారు.

ఆదానీ మైనింగ్ ప్రాజెక్టుకు అప్పు ఇవ్వకపోతే.. మైనింగ్ నిలిచిపోతుందని.. మా దేశంలోని వాతావరణాన్ని, పర్యావరణాన్ని కాపాడుకున్నోళ్లం అవుతాం అని నిరసనకారులు తెలిపారు. మొత్తం 50 మంది గ్రౌండ్ లో ప్లకార్డులతో నిరసన తెలిపారు.. ఓ ముగ్గురు మాత్రం గ్రౌండ్ లోకి వచ్చి.. పిచ్ దగ్గర నిలబడి తమ నిరసన తెలిపారు.

సెక్యూరిటీ సిబ్బంది వాళ్లను స్టేడియం నుంచి బయటకు తీసుకెళ్లారు. స్టాప్ ఆదానీ గ్రూప్ పేరుతో ఈ నిరసనలను ప్రచారం చేస్తున్నారు. ఈ క్రికెట్ గ్రౌండ్ నుంచి.. భారత్ లోని స్టేట్ బ్యాంక్ ఇండియాకు తమ నిరసన తెలుపుతున్నాం అని.. మీరు 7 వేల కోట్లు అప్పు ఇవ్వకపోతే మైనింగ్ ఆగిపోతుంది.. లేకపోతే మేమే పోరాటం చేసి అడ్డుకుంటాం.. అప్పుడు మీ డబ్బులు తిరిగి రావు అంటూ స్టేట్ బ్యాంక్ ఇండియాకు హెచ్చరిక పంపారు నిరసనకారులు.

అంతా వాళ్ల పిచ్చికానీ.. ఇండియాలో బ్యాంకులు ఇచ్చిన అప్పులు అన్నీ తిరిగి వస్తున్నాయా ఏంటీ..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు