Security forces: ‘ఆపరేషన్ ప్రహార్-3’ రంగంలోకి భద్రతా దళాలు

Security forces: భారత సైనిక వ్యవస్థ అత్యంత శక్తివంతమైనది. ప్రపంచంలో మరే దేశానికి లేని ఘటక్, పారాట్రూపర్లు భారత సైన్యంలో ఉన్నారు. చేతుల్లతో శత్రువుల ఎముకలు విరగొట్టగల శక్తి వీరికి ఉంటుంది. ఇంత ప్రావిణ్యం ఉన్న సైనికులు ఉన్న చిన్నపాటి పొరపాట్లు బారి సంఖ్యలో మన జవాన్లు ప్రాణాలు కోల్పోయేలా చేస్తుంది. దీనికి నిదర్శనం పుల్వామా దాడి, ఛత్తీస్ ఘడ్ లో భద్రతా బలగాలపై దాడి.

సరిహద్దుల్లో టెర్రరిస్టులు, దేశంలో మావోయిస్టులు భద్రతా బలగాలపై నిత్యం దాడులకు తెగబడుతూనే ఉన్నారు. వీరిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. కనిపిస్తే కాల్చేయమని తెలిపింది. ఇక తాజాగా ఛత్తీస్ ఘడ్ లో జరిగిన ఘటనను కేంద్ర హోంశాఖ చాలా సీరియస్ గా తీసుకుంది. ఎలాగైనా దీటైన జవాబిచ్చి తీరాలని నిర్ణయించుకుంది. దాడికి సూత్రధారైన హిడ్మాను టార్గెట్ చేస్తూ ఓ కొత్త ఆపరేషన్ కు భద్రతా బలగాలు సిద్ధమయ్యాయి.

హిడ్మాతోపాటు మరో ఏడుగురు మావోయిస్టు కమాండర్ల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఇక దీనికి ఆపరేషన్ ప్రహర్ – 3 అని నామకరణం చేశారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. దీనికి ఇంటెలిజెన్స్ అధికారులు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, crpf ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో నక్సలైట్లకు వ్యతిరేకంగా ఆపరేషన్‌ను ముమ్మరం చేయండి. మానవ మేధస్సుతో పాటు సాంకేతికతను కూడా బాగా వాడండి. మిగతా భద్రతా సంస్థలు కూడా సహాయం చేస్తాయి.” అని అమిత్‌షా అన్నట్లు తెలుస్తోంది. అమిత్ షా నుంచి ఆర్డర్స్ రావడంతో భద్రతా బలగాలు ‘మోస్ట్‌వాంటెడ్’ జాబితాను రూపొందించింది. అందులో మావోయిస్ట్ టాప్ కమాండర్‌తో పాటు మరో ఎనిమిది మంది జాబితాను రూపొందించారు. ఇక యువతను మావోయిజం వైపు ఆకర్షించే వారిపై కూడా ఒక కన్ను వెయ్యాలని తెలిపారు షా.. జనావాసాల్లో ఉండి కార్యకలాపాలు నిర్వహించేవారే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులను అమిత్ షా అన్నట్లు తెలుస్తుంది.

‘ఆపరేషన్ ప్రహార్-3’ రంగంలోకి భద్రతా దళాలు

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు