జగన్ చెప్పిందే జరిగింది – జులై వరకు వ్యాక్సిన్ ఇవ్వలేమని తేల్చిన సీరం చీఫ్

serum institue punawala

” ప్రస్తుతం వ్యాక్సిన్ కొరత ఉంది, రానున్న జూన్,జులై వరకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం కష్టం”, అని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మీడియా సాక్షిగా తేల్చి చెబితే అనేక మంది బహిరంగ విమర్శలు చేశారు. ఏపీ పూర్తిగా విఫలం అయిందని, వ్యాక్సినేషన్ వేయడం చేతకాదు అని అనేక మీడియాలు సమస్యను అర్థం చేసుకోకుండా కామెంట్లు చేశాయి.

నాలుగైదు రోజుల కిందట వైయస్ జగన్ ఏదైతే చెప్పారు, అదే విషయాన్ని ప్రస్తుతం పుణే సీరం సంస్థ మరోసారి తేల్చి చెప్పింది. ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆ సంస్థ సీఈఓ అద‌ర్ పూనావాలా, వాక్సిన్లు కొరత ఏర్పడటానికి కారణం కేంద్ర ప్రభుత్వమేనని వెల్లడించారు.

నిర్లక్షంతో ఆర్డర్ ఇవ్వలేదు – అందుకే తయారీ పెంచలేదు

జనవరి నెలలో కరోనా తీవ్రత తగ్గడంతో కేంద్రప్రభుత్వం, రాజకీయ నాయకులు, ఈ అంశాన్ని తేలికగా తీసుకున్నారని అభిప్రాయపడ్డారు.కరోనా తగ్గిపోయిందనే ఉద్దేశంతో వ్యాక్సిన్లకు ఆర్డర్లు ఇవ్వడంలో నిర్లక్షంగా ఉన్నారని, ఆర్డర్లు రాకపోవడంతో మా సంస్థ వ్యాక్సిన్ తయారీ సామర్థ్యాన్ని పెంచలేదని అదర్ పూనావాలా వెల్లడించారు.

ప్రస్తుతం మా సామర్థ్యం నెలకు 6 నుండి 7 కోట్లు మాత్రమే,దాన్ని 10కోట్లకు పెంచడానికి ప్రయత్నిస్తున్నాం అని వెల్లడించారు. జరిగిన తప్పుకు తమ సంస్థను నిందించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది,అయితే అందులో ఏమాత్రం నిజం లేదని చెప్పారు పూనావాలా. ప్రస్తుతం కనీసం 100కోట్ల డోసుల వ్యాక్సిన్ అవసరం ఉంది. ఈ స్థాయిలో వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే అది ఇప్పట్లో అయ్యే పని కాదు అని స్పష్టం చేశారు.

వ్యాక్సిన్ తయారీని 10కోట్లకు పెంచినప్పటికి వ్యాక్సిన్ కొరత తీరడానికి కనీసం జులై లేదా ఆగస్టు వరకు సమయం పడుతుందని. ఇక ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాలంటే అక్టోబర్ లేదా డిసెంబర్ వరకు సమయం అవసరం అవుతుందని అభిప్రాయపడ్డారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు