సీఎం జగన్ కు స్టాలిన్ ఫోన్ – ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానం

stallin call jagan for meeting

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్న డీఎంకే చీఫ్ స్టాలిన్ ప్రమాణ స్వీకారం మే 7వ తేదీ జరగబోతున్నది. కరోనా కారణంగా నిరాడంబరం ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు స్టాలిన్. ఈ మేరకు ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇచ్చారు.

సీఎంగా బాధ్యతలు స్వీకరించే కార్యక్రమం నిరాడంబరం నిర్వహించినా.. అత్యంత ముఖ్యులకు ఆహ్వానాలు పంపుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ కు.. స్వయంగా ఫోన్ చేశారు స్టాలిన్. ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని కోరారు. ఈ సందర్భంగా ఫోన్ లోనే స్టాలిన్ కు అభినందనలు చెప్పారు జగన్. ఆల్ ద బెస్ట్ బ్రదర్ అంటూ తన విషెస్ అందించారు జగన్.

కరోనా నిబంధనలు ఉన్నాయని.. ఈ క్రమంలో అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆహ్వానాలు ఉన్నాయని.. నిరాడంబరంగా వేడుక జరుగుతుందని స్టాలిన్ వివరించారంట. ఇలాంటి పరిస్థితుల్లో ఇదే బెస్ట్ అని స్టాలిన్ ఆహ్వానాన్ని స్వీకరించారంట సీఎం జగన్.

2019లో జగన్.. సీఎంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కుమారుడితో సహా హాజరయ్యారు స్టాలిన్. ఆ సందర్భంగా ప్రత్యేక విందు సైతం ఏర్పాటు చేశారు సీఎం జగన్. ఈ వేడుకకు అప్పట్లో తెలంగాణ సీఎం కేసీఆర్, స్టాలిన్ వేదికపై ఉన్నారు.

ఆ పరిచయం, వ్యక్తిగతంగా ఉన్న అభిమానంతో.. సీఎం జగన్ కు స్వయంగా స్టాలిన్ ఫోన్ చేసి ఆహ్వానించారు. కోవిడ్ నిబంధనలు ఉన్న ఈ సమయంలో.. చెన్నై వెళ్లాలా లేదా అనేది ఇంకా నిర్ణయించుకోలేదంట సీఎం జగన్.. మే 7వ తేదీన స్టాలిన్ ప్రమాణ స్వీకారం ఉంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు