వచ్చే ఆదివారం రాష్ట్రం అంతా లాక్ డౌన్.. పబ్లిక్ ప్లేసుల్లో శానిటైజేషన్

వచ్చే ఆదివారం రాష్ట్రం అంతా లాక్ డౌన్.. పబ్లిక్ ప్లేసుల్లో శానిటైజేషన్

Sunday lockdown imposed in Uttar Pradesh

వచ్చే ఆదివారం రాష్ట్రం అంతా లాక్ డౌన్.. పబ్లిక్ ప్లేసుల్లో శానిటైజేషన్

కరోనా విజృంభణతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అత్యవసరం సమావేశాలు నిర్వహిస్తున్నాయి. వైరస్ వ్యాప్తి కట్టడికి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్.. ఐసోలేషన్ లోనే ఉండి.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతోపాటు వైద్య ఆరోగ్య శాఖతో పరిస్థితిని సమీక్షించారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క రోజులోనే 40 వేలకుపైగా కేసులు నమోదు కావటంపై సమీక్షించిన ఆయన.. వచ్చే ఆదివారం అనగా.. ఏప్రిల్ 18వ తేదీన రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ విధించాలని ఆదేశించారు. శనివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని.. అన్నీ మూసివేయాలని.. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని ఉత్తర్వులు జారీ చేశారు.

లాక్ డౌన్ సమయంలో రద్దీ ప్రాంతాల్లో శానిటైజ్ చేయాలని.. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ధియేటర్లు, మార్కెట్లు, ఆఫీసుల్లో శానిటైజ్ చేయాలని సూచించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి.. కూరగాయలు, పాలు, నిత్యావసర సరుకులను ముందుగానే కొనుగోలు చేసి పెట్టుకోవాలని ఆదేశించారు.

ఆదివారం రోజు బయటకు వచ్చే వారు అత్యవసరం సేవల కోసం మాత్రమే రావాలని.. ఇతరులు ఎవరూ బయటకు రావొద్దని కఠిన ఆంక్షలు పెట్టారు. మాస్క్ లేకుండా కనిపిస్తే వెయ్యి రూపాయల జరిమానా విధించాలని.. పోలీసులు, మున్సిపల్ సిబ్బందికి ఈ బాధ్యత ఉంటుందని స్పష్టం చేశారు. మాస్క్ లేకపోతే కఠినంగా వ్యవహరించాలని పవర్స్ ఇచ్చేశారు సీఎం యోగీ.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు