అమ్మ లేకపోయినా అల్లాడించిన అన్నాడీఎంకే : స్టాలిక్ కు చుక్కలు చూపించారు.. ఎవరూ ఊహించలేదే..

tamil nadu elections result

తమిళనాడు రాష్ట్ర చరిత్రలో ఓ కీలక ఘట్టం ఆవిష్కరించింది 2021 అసెంబ్లీ ఎన్నికలు. జయలలిత, కరుణానిధి లేకుండా జరిగిన ఈ ఎన్నికల్లో.. ఈసారి డీఎంకే పార్టీదే విజయం అని స్పష్టం అయ్యింది. 234 నియోజకవర్గాలు ఉన్న తమిళనాడులో.. 135 నియోజకవర్గాల్లో స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తోంది డీఎంకే పార్టీ. కాబోయే సీఎం స్టాలిన్ అని స్పష్టంగా సంకేతాలు వచ్చినా.. అన్నాడీఎంకే పార్టీ సాధిస్తున్న సీట్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. “అమ్మ లేకపోయినా అల్లాడించిన అన్నాడీఎంకే.. స్టాలిక్ కు చుక్కలు చూపించారు.. ఎవరూ ఊహించలేదే”, అని దేశం మొత్తం అనుకుంటుంది.

ఈసారి తమిళనాడులో విజయం డీఎంకే పార్టీదే అని అందరూ డిసైడ్ అయ్యారు.. క్లీన్ స్వీప్ ఖాయం అంటూ ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పాయి. పది ఎగ్జిట్ పోల్ సంస్థలు తమ సర్వే ఫలితాలు వెల్లడిస్తే.. పది 10 సర్వేలు.. అన్నాడీఎంకే పార్టీకి 60 సీట్లు మించి రావని తేల్చేశాయి. కొన్ని సర్వేలు అయితే 35 నుంచి 45 సీట్లు గెలుచుకుంటుందని జోస్యం చెప్పాయి. మే 2వ తేదీ ఫలితాల్లో సర్వేలు అన్ని తలకిందులు అయ్యాయి.

సీఎం పళనిస్వామి – పన్నీరుసెల్వం ఆధ్వర్యంలోని అన్నాడీఎంకే పార్టీ ఏకంగా 100 సీట్లలో ఆధిక్యంలో దూసుకెళ్తుంది. డీఎంకే పార్టీ మాత్రం 135 దగ్గరే ఆగిపోతుంది. ఓ 10 సీట్లు అటూ ఇటూ తుది ఫలితాలు ఉండొచ్చని చెబుతున్నారు. ఊహించని దాని కంటే అన్నాడీఎంకే మెరుగైన ఫలితాలు సాధించటం తమిళనాడు రాజకీయాల్లోనే ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఏ రాజకీయ విశ్లేషకుడు, ఏ సర్వే సంస్థ సైతం దీన్ని పసిగట్టలేకపోయింది.

అన్నాడీఎంకే పార్టీ 100 సీట్లలో ఆధిక్యంలో ఉండటం.. తుది ఫలితాలు వచ్చే సమయానికి 90 సీట్లలో గెలుపు ఖాయంగా కనిపిస్తుండటంతో డీఎంకే పార్టీ సైతం షాక్ అవుతుంది. డీఎంకే పార్టీ ఈ ఎన్నికల్లో 175 సీట్లు ఖాయం అని ఘంటాపదంగా చెప్పిన అన్ని సర్వేలు తప్పని తేలిపోయాయి. తమిళనాడు ఓటర్ల నాడి పట్టుకోవటంలో ఘోరాతి ఘోరంగా విఫలం అయ్యాయి.

పళనిస్వామి, పన్నీరుసెల్వంను తక్కువ అంచనా వేసి డీఎంకే సైతం బోల్తా పడిందా.. మెజార్టీ సీట్లు సాధించటంలో విఫలం అయ్యిందా.. గ్రౌండ్ లెవల్ లో ఏదో జరిగింది.. జనం నాడి మరోలా ఉంది అని తమిళనాడు విశ్లేషుకులు ఇప్పుడు అంటున్నారు..

అమ్మ లేకపోయినా అద్భుతంగా సీట్లు సాధించిన అన్నాడీఎంకే పార్టీ అంటున్నారు.. అధికారానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 117 సీట్లను డీఎంకే ఈజీగా గెలచుకోవటంతో.. కాబోయే సీఎం స్టాలిన్ అని కన్ఫామ్ అయిపోయింది.

See also : మోడీకి షాక్ ఇచ్చిన బెంగాళ్ : ప్రచారం 16 నియోజకవర్గాల్లో :14 స్థానాల్లో ఓడిపోయిన బీజేపీ..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు