IPS Officer GP singh : ఐపీఎస్ అధికారిపై రాజద్రోహం కేసు

IPS Officer GP singh :  అక్రమ ఆస్తులు కేసులో సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి జీపీ సింగ్ పై ఛత్తీస్ ఘడ్ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. వివిధ వివాదాలకు తెరలేపి, నేతలు, ప్రభుత్వంపై కుట్ర పన్నినట్లు ఆరోపిస్తూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

మరోవైపు ఏసీబీ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ చేసిన దాడుల్లో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గురించారు పోలీసులు. ఈ కేసు విచారణ చేస్తున్న సమయంలోనే ఐపీఎస్ అధికారి పన్నిన కుట్ర బయటపడినట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు.

ఈయనపై ఐపీసీ సెక్షన్ 124-ఏ, 153 – ఏ కింద రాయ్ పూర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు చెప్పారు.

మూడు రోజుల పాటు ఇటీవల ఏసీబీ, ఈఓడబ్ల్యూలు సుమారు 15 చోట్ల సోదాలు నిర్వహించాయి. ఆఫీసర్ వద్ద సుమారు పది కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. 1994 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ జీపీ సింగ్ గతంలో ఏసీబీలో అడిషనల్ డైరక్టర్ జనరల్‌గా చేశారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు