అమెరికాలో మళ్లీ కరోనా విజృంభణ – ఒక్క రోజులో లక్ష కేసులు – ప్రపంచం ఒకలా ఉంటే.. అమెరికాలో మరోలా ఫీలవుతుంది

అమెరికాలో ఇప్పటి వరకు కోటికి పైనే కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయితే.. 2 లక్షల 39 వేల మంది చనిపోయారు.

అమెరికా అనగానే అందరూ ఎన్నికల గురించే మాట్లాడుతున్నారు. ట్రంప్ వైట్ హౌస్ నుంచి బయటకు వస్తారా.. ఓటమిని అంగీకరిస్తారా అనే చర్చే ప్రపంచం అంతా వింటున్నారు. ఇదంతా అమెరికా వెలుపల ప్రపంచ దేశాలు ఆలోచిస్తున్న తీరు.
అమెరికా ప్రజలు మాత్రం ఎన్నికల మూడ్ నుంచి బయటకు వచ్చేశారు. బిడెన్ కాబోయే అధ్యక్షుడు అని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు అమెరికన్లు ఆలోచిస్తున్నది ఏంటో తెలుసా.. కరోనా వైరస్.

ఎందుకంటే వారం రోజులుగా అమెరికాలో కరోనా వైరస్ విలయతాండం చేస్తోంది. మంగళవారం ఒక్క రోజే అమెరికాలో లక్షా 34 వేల కేసులు నమోదు అయితే.. వెయ్యి 450 మంది కరోనాతో చనిపోయారు.
కరోనా వైరస్ సెకండ్ వేవ్.. బీభత్సంగా ఉందని.. ఆగస్ట్ నాటి పరిస్థితులు మళ్లీ వచ్చాయని.. అంత కంటే తీవ్రంగా వైరస్ వ్యాప్తి ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.
ఎన్నికలు ముగిసిన వారం రోజులకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. వారం రోజులుగా లక్ష పైనే నమోదు అవుతున్నాయి. ఈ వారం రోజుల్లోనే అత్యధికంగా మంగళవారం లక్షా 34 వేలు పాజటివ్ కేసులు రావటంతో ఆస్పత్రులు అన్నీ మళ్లీ రద్దీగా మారాయి. బెడ్స్ దొరకని పరిస్థితి నెలకొంది.

ప్రపంచ దేశాలు అన్నీ అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి మాట్లాడుతుంటే.. అమెరికన్లు మాత్రం కరోనాతో పోరాటం చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు బిడెన్ సైతం.. కరోనాపై పోరాటం ముగిసిపోలేదని చెబుతున్నారు అంటున్నారు అమెరికన్లు.
అమెరికాలో ఇప్పటి వరకు కోటికి పైనే కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయితే.. 2 లక్షల 39 వేల మంది చనిపోయారు.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు