దేశంలోనే పెద్ద రాష్ట్రం లాక్ డౌన్.. యూపీ మూసివేత.. సీఎం సంచలన నిర్ణయం..

దేశంలోనే పెద్ద రాష్ట్రం లాక్ డౌన్.. యూపీ మూసివేత.. సీఎం సంచలన నిర్ణయం..

uttar pradesh announces lockdown
uttar pradesh announces lockdown

దేశంలోనే పెద్ద రాష్ట్రం లాక్ డౌన్.. యూపీ మూసివేత.. సీఎం సంచలన నిర్ణయం..

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో.. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కో ధంగా నిర్ణయం తీసుకుంటూ ముందుకెళుతుంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్ లాక్ డౌన్ ప్రకటించింది. ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు ఐదు రోజులు రాష్ట్రం మొత్తాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు సీఎం యోగీ ఆదిత్యనాథ్.

ఏప్రిల్ 30వ తేదీ రాత్రి నుంచి మే 4వ తేదీ ఉదయం 5 గంటల వరకు సంపూర్ణ లాక్ డౌన్ అమల్లో ఉంటుందని.. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. అంతర్ రాష్ట్ర సర్వీసులు నడుస్తాయని.. రాష్ట్రం నుంచి వెళ్లే ఇతర రాష్ట్రాల వాహనాలకు ఎలాంటి ఆటంకం ఉండదని వెల్లడించింది యూపీ ప్రభుత్వం.

లాక్ డౌన్ సమయంలో.. ఉదయం 6 నుంచి 10 గంటలు.. కేవలం నాలుగు గంటలు మాత్రమే ప్రజలు బయటకు రావటానికి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. ఈ నాలుగు గంటల్లోనే నిత్యావసరాలు, ఇతర సామాగ్రి కొనుగోలు చేయాలని సూచించారు. ఐదు రోజులు రెస్టారెంట్లు, బార్లు, పబ్స్, వైన్ షాపులు వంటివి పూర్తిగా మూసివేయనున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం.

uttar pradesh announces lockdown

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు