సెక్స్ వర్కర్లకు వ్యాక్సినేషన్ డ్రైవ్.. ఇది చాలా ముఖ్యంగా తేల్చారు

vaccination works for workers in delhi

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ విషయంలో కొత్త నిబంధనలు.. సరికొత్త వ్యూహంతో ముందుకెళుతుంది కేంద్ర ప్రభుత్వం. సమాజంలోని ఆయా వర్గాలను దృష్టిలో పెట్టుకుని కరోనా సూపర్ స్పెడ్డర్లను గుర్తించి.. వాళ్లకు ముందస్తుగా వ్యాక్సిన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. అందులో భాగంగా ఇప్పటికే ఆటో డ్రైవర్లు, కిరాణా షాపు వర్కర్లు, మాల్స్ లో పని చేసే వారికి అధిక ప్రాధాన్యం ఇస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు ఇందులో మరికొన్ని కొత్త క్యాటగిరీలను చేర్చారు.

సెక్స్ వర్కర్లకు సైతం ముందుకు వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ముంబైలోని రెడ్ లైట్ ఏరియాలోని 13 వందల మంది సెక్స్ వర్కర్లకు మూడు రోజుల్లో వ్యాక్సిన్ వేశారు. ఒక్క ముంబైలోనే కాకుండా.. కోల్ కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాల్లోని సెక్స్ వర్కర్లకు వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయాలని సూచించింది కేంద్ర ప్రభుత్వం.

సెక్స్ వర్కర్లకు వ్యాక్సినేషన్ వల్ల వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని.. ఆయా ప్రాంతాలను ఆధారంగా వ్యాప్తిని కట్టడి చేయొచ్చని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆయా సిటీస్ లో గుర్తింపు పొందిన రెడ్ లైట్ ఏరియాల్లోని సెక్స్ వర్కర్లే కాకుండా గుర్తింపు లేని ప్రాంతాల్లో ఉండే వారు సైతం వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించింది కేంద్ర ప్రభుత్వం.

టూరిజం ప్రాంతాల్లోనూ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని సూచించింది. ప్రైవేట్ సంస్థల నుంచి వ్యాక్సిన్ కొనుగోలు చేసి.. వీటిని ఆయా సంస్థలే వేయాలని.. ముందుగా టూరిజం ప్రాంతాల్లో పని చేసే ప్రభుత్వ, ప్రైవేట్ సిబ్బందికి వ్యాక్సిన్ వేసిన తర్వాత.. ఆయా ప్రాంతాల్లో వ్యాపారులు, సర్వర్లు, డెలివరీ బాయ్స్ కు వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేయటం ద్వారా పర్యాటక రంగం నిలదొక్కుకుంటుందని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు