లాక్ డౌన్ లో వ్యాక్సిన్ ఇవ్వకపోతే.. మరింత డేంజర్ లోకి దేశం.. హెచ్చరిస్తున్న ప్రపంచం

ఇక వ్యాక్సిన్ అందరికీ.. 18 ఏళ్లు నిండితే చాలు.. పరిగెత్తండీ రో..

భారతదేశం రెండు సమస్యలను ఎదుర్కొంటుంది.. లాక్ డౌన్ ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయటం ద్వారా.. ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించి.. ప్రజలను కాపాడటం.. దీనికి లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం.. ఆ దిశగా భారత్ ఇప్పుడు లాక్ డౌన్ పెట్టి కరోనాను కట్టడి చేస్తుంది. అయితే ఎన్నాళ్లు ఇలా లాక్ డౌన్ పెట్టి దేశాన్ని దిగ్భంధిస్తారు అనే ప్రశ్న వెంటనే వేస్తోంది. దీనికి కారణాలు లేకపోలేదు.

లాక్ డౌన్ పెట్టినంత మాత్రానా కరోనా అంతం అయిపోయింది అని చెప్పలేం.. జస్ట్ కట్టడి అవుతుంది.. కరోనా సమాజంలో అలాగే ఉంటుంది.. లాక్ డౌన్ తర్వాత మళ్లీ కరోనా విజృంభిస్తుంది అనటానికి సెకండ్ వేవ్ ఉదాహరణ.. కరోనాను పూర్తిగా అంతం చేయటానికి వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారం. కాకపోతే ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్ నెలకు 8 కోట్లు మాత్రమే. ఈ విధంగా రోజుకు 2 కోట్ల మంది వ్యాక్సిన్ ఇస్తూ వెళితే.. రెండేళ్లు పడుతుంది. రెండేళ్లు లాక్ డౌన్ పెట్టలేరు కాబట్టి మళ్లీ కరోనా తీవ్రంగా వస్తుంది అని హెచ్చరిస్తున్నాయి ప్రపంచ దేశాలు.

లాక్ డౌన్ సమయంలోనే వ్యాక్సినేషన్ అనేది యుద్ధంలా సాగాలని.. అప్పుడే లాక్ డౌన్ ఫలితం ఉంటుందని చెబుతున్నాయి అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు, దేశాలు.

ఇదే విషయాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కుండబద్దలు కొట్టారు. ఢిల్లీలో నెల రోజులుగా లాక్ డౌన్ వల్ల పాజిటివ్ రేటు 15 శాతానికి తగ్గించాం.. రోజువారీ కేసులు 10 వేలకు వచ్చాయి.. ఈ సమయంలో వ్యాక్సిన్ ప్రక్రియ యుద్ధంలా సాగి ఉంటే.. రోజుకు రెండు కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చి ఉంటే.. లాక్ డౌన్ సమయంలోనే కరోనా అంతం అయ్యేదని చెబుతున్నారు.

కేంద్ర ప్రభుత్వంలోని ప్రధానమంత్రి మోడీ మాత్రం.. ఇప్పటి వరకు వ్యాక్సిన్ పై యుద్ధం ప్రకటించలేదు. ఇంకా నెలకు 8 కోట్ల వ్యాక్సిన్లు మాత్రం వేస్తూ ఉన్నారు.. మోడీ ఈ దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు అని ప్రశ్నిస్తున్నారు.

ప్రపంచంలోని ఇతర దేశాల్లోని వ్యాక్సిన్ కంపెనీలతో మాట్లాడి.. కోట్ల వ్యాక్సిన్లను దిగుమతి చేసుకుని.. లాక్ డౌన్ సమయంలోనే వ్యాక్సిన్ పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది అంటున్నారు.

చెబితే వినేవాళ్లకు చెప్పొచ్చు.. అన్నీ తెలిసిన మోడీకి ఇలా ఎలా చెబుతారండీ అంటున్నారు మరికొందరు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు