బాలున్ని రక్షించబోయి పెను ప్రమాదంలో పడ్డ గ్రామస్థులు : నలుగురు మృతి

Bhopal villagers in risk of life

పొరపాటున బావిలో పడిన బాలున్ని రక్షించబోయి గ్రామస్థులు పెను ప్రమాదంలో పడిన్ సంఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ సమీపంలో చోటు చేసుకుంది. భోపాల్ లోని విదిష పట్టణానికి దగ్గరలో ఉన్న గంజ్ బసోడ అనే గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బాలుడు ఆడుకుంటూ వెళ్లి పొరపాటుగా ఆ బావిలో పడిపోయాడు. ఆ బాలున్ని రక్షించడానికి పెద్ద ఎత్తున గ్రామస్థులు అక్కడకు చేరుకున్నారు.

అంత బాగానే ఉంది అనుకోకుండా కూలిన బావి గోడ

బావిలో ఉన్న బాలున్ని రక్షించడానికి కొంత మంది బావిలోకి దిగారు. అయితే ఈ మొత్తం తతంగాన్ని చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు బావి వద్దకు చేరుకోవడంతో, ఆ తాకిడికి ఒక్కసారికి బావి గోడ కుప్పకూలింది. ఒక్కసారిగా బావి గోడ కూలడంతో పట్టుతప్పి దాదాపు 30 మంది ఒకేసారి ఆ బావిలో పడిపోవడం వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం వెంటవెంటనే జరిగిపోయాయి.

ఒకే గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందటంతో పాటు అనేక మంది గాయపడటంతో, గ్రామ ప్రజలు విషాధంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడకు చేరుకుని వారిని కాపాడారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు