రాష్ట్రల మధ్య ఆక్సిజన్ యుద్ధాలు – మా ఆక్సిజన్ ఢిల్లీ దోచుకెళ్తుంది : హర్యానా ముఖ్య మంత్రి

oxygen war betweeen delhi and haryana

ఆక్సిజన్ ట్యాంకర్ల విషయంలో ఢిల్లీ.. హర్యానా ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు చేతల వరకు వెళ్లేలా ఉంది. ఫరీదాబాద్ సరిహద్దుల్లోని రెండు ఆక్సిజన్ ట్యాంకర్లను పోలీస్ బందోబస్తు మధ్య ఢిల్లీలోని ఆస్పత్రులకు తీసుకెళ్లి.. 235 మంది ప్రాణాలను కాపాడిన విషయం.. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసింది.

ఆ ఆక్సిజన్ ట్యాంకర్లు బుక్ చేసింది హర్యానా ప్రభుత్వం అంట. ఈ విషయం హర్యానా ప్రభుత్వానికి చెప్పకుండా.. అత్యవసరం కింద.. హై సెక్యూరిటీ మధ్య ఢిల్లీ ప్రభుత్వం తీసుకెళ్లిందని.. ఇది కిడ్నాప్ అంటూ హర్యానా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ ఆరోపిస్తున్నారు. ఢిల్లీలో కరోనా తీవ్రత, ఆక్సిజన్ కొరతను సాకుగా చూపింది.. హర్యానాకు రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్లను ఢిల్లీ ప్రభుత్వం కిడ్నాప్ చేస్తుందని.. లూటీ చేస్దుందని బహిరంగంగా ఆరోపించారు.

హర్యానా రాష్ట్రంలో ఉన్నది ప్రజలు కాదా అని ప్రశ్నిస్తున్నారు. హర్యానా రాష్ట్రంలో వైరస్ తీవ్రంగానే ఉందని.. రోగులకు ఆక్సిజన్ కొరత ఉందని.. ఇవేవీ పట్టకుండా ఢిల్లీ ప్రభుత్వం హైజాక్ చేస్తుందని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని.. లేకపోతే హర్యానా పోలీసులు.. ఢిల్లీకి చెందిన ఆక్సిజన్ ట్యాంకర్లను ఎత్తుకెళతారని వార్నింగ్ ఇస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం కరోనా కేసులను ఎక్కువ చూపిస్తూ.. హడావిడి చేస్తుందని.. హర్యానాలోని పరిస్థితి పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తూ ముందుకు వెళుతుందన్నారు.

ఢిల్లీ ప్రభుత్వం వైఖరి ఇలాగే కొనసాగితే.. హర్యానా పోలీసులు సైతం ఢిల్లికి చెందిన ఆక్సిజన్ ట్యాంకర్లను హైజాక్ చేసి తీసుకొస్తారని వార్నింగ్ ఇస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు