కరోనా కట్టడికి వీకెండ్ లాక్ డౌన్..

కరోనా కట్టడికి వీకెండ్ లాక్ డౌన్..

Weekend lockdown in Delhi
Weekend lockdown in Delhi

దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాక్షికంగా లాక్ డౌన్ విధించింది. వీకెండ్ రెండు రోజులు లాక్ డౌన్ విధిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.

ప్రతి శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. అత్యవసర సేవలను లాక్ డౌన్ నుంచి మినహాయించారు. అంతర్ రాష్ట్ర బస్సు, రైలు, విమాన సర్వీసులకు అనుమతి ఇచ్చింది.

  1. అన్ని మార్కెట్లు, మాల్స్, జిమ్స్ వీకెండ్ రోజుల్లో పూర్తిగా మూసివేస్తారు.
  2. ప్రైవేట్ ఆఫీసులు, కాల్ సెంటర్లు వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేయాలి.
  3. రెస్టారెంట్లు కేవలం టేక్ అవే మాత్రమే అమలు.. పార్శిల్స్ మాత్రమే అనుమతి.
  4. రెగ్యులర్ రోజుల్లోనూ సినిమా హాల్స్ లో 30 శాతం సీటింగ్ అనుమతి. వీకెండ్ తో సినిమా హాళ్లు, ధియేటర్లు మూసివేత

ఏప్రిల్ 17వ తేదీ రాత్రి నుంచి మళ్లీ ఉత్తర్వులు వచ్చే వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది.
ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలి.

ఢిల్లీలో మోడల్ విధానాన్ని మిగతా రాష్ట్రాలు కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్, ముంబై, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో ఈ విధానం ద్వారా కరోనా కట్టడికి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు