మే 7 నుంచి 10వ తేదీ వరకు ఏం జరగబోతుంది-ముందే హెచ్చరిస్తున్న ప్రభుత్వాలు : మనమేం చేయాలంటే..

corona cases to hit peak by may 7

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. మే 4వ తేదీ ఒక్క రోజే 3 లక్షల 82 పాజిటివ్ కేసులు నమోదైతే.. 3 వేల 800 మంది చనిపోయారు. ఇది మే 4వ తేదీ లెక్క.. మే 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ సంఖ్య డబుల్ కావొచ్చని హెచ్చరిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ కోవిడ్ సూపర్ మోడల్ కమిటీ హెడ్ ఎం.విద్యాసాగర్.

ఏడాది కాలంగా కరోనా కేసుల పెరుగుదల – తగ్గుదలపై పరిశోధనలు చేస్తోంది ఈ కమిటీ. దేశంలో సెకండ్ వేవ్ పై అధ్యయనం చేసిన ఈ కమిటీ.. మే 7వ తేదీన కేసుల సంఖ్య 8 లక్షల వరకు నమోదు కావొచ్చని హెచ్చరిస్తోంది. కనీసం 8 లక్షల నుంచి 10 లక్షల వరకు పీక్ స్థాయికి వెళుతుందని.. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దీన్ని థర్డ్ వేవ్ గా భావించాల్సి వస్తుందని హెచ్చరించింది.

మే 7వ తేదీ తర్వా త గతంలో ఎప్పుడూ లేని విధంగా దేశంలో అత్యధిక కేసులు నమోదవుతాయని.. ఆ తర్వాత క్రమంగా తగ్గుదల ఉంటుందని. ప్రజలు భయాందోళనలకు గురి కావొచ్చని సూచిస్తోంది. మే 5వ తేదీ నాటికి దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 35 లక్షలుగా ఉంది. ఈ లెక్కలను పరిగణలోకి తీసుకుంటే.. మే 7వ తేదీ తర్వాత ఆల్ టైం హైకి చేరుతాయని.. చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరుతున్నారు. మే 4వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 16 కోట్ల మందికే వ్యాక్సిన్ వేశారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు