ప్రపంచానికి సైతం అర్థం కాని మోడీ విధానం : ఎందుకు అలా చేయటం లేదని తలలు పట్టుకుంటున్న శాస్త్రవేత్తలు

PM Modi to hold a video-conference with CM’s of all States on 8th April

ఈ భూ మండలంపై ఉన్న అన్ని ప్రపంచ దేశాలు.. భాతరదేశంలో కరోనా విలయంపై కన్నీళ్లు పెడుతున్నాయి. తోచిన సాయాన్ని చేస్తున్నాయి.. దీనికి కారణం ఏంటో తెలుసా.. భూ ప్రపంచంలో నమోదు అవుతున్న కరోనా కేసులు రోజువారీ మొత్తం కేసులు 8 లక్షల 42 వేలు అయితే.. ఒక్క భారత్ లోనే 4 లక్షల 14 వేలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం కరోనా కంట్రోల్ అయినా.. ఒక్క ఇండియాలో మాత్రమే విజృంభిస్తోంది. ఇంత జరుగుతున్నా.. ఒకే ఒక్క విషయం మాత్రం ప్రపంచం మొత్తానికి అర్థం కావటం లేదు.. మోడీ విధానం ఏంటో తెలియక తలలు పట్టుకుంటున్నారు..

ప్రస్తుతం భారతదేశంలో కరోనా విలయతాండవం చూస్తుంటే.. హెల్త్ ఎమర్జెన్సీని తలపిస్తోంది. అంటే వైద్య శాస్త్రంలో అత్యవసర పరిస్థితి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం – ప్రైవేట్ రంగం అని తేడా లేకుండా అన్ని వ్యవస్థలను తన ఆధీనంలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం పని చేయాల్సి ఉంటుంది. కరోనాను ఇప్పటికిప్పుడు ఆపలేకపోయినా.. వ్యాక్సినేషన్ ప్రక్రియ ద్వారా.. రాబోయే రోజుల్లో పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు. అందుకు కావాల్సింది ఏంటీ అంటే వ్యూహారచన.. అమెరికా, ఇంగ్లాండ్ దేశాలతోపాటు ప్రపంచంలోని అన్ని దేశాలు అమలు చేసిన విధానం. అదేంటో చూద్దాం..

కరోనా ఉధృతంగా ఉన్న సమయంలోనూ లాక్ డౌన్ పెట్టని అమెరికా.. అందుకు పరిష్కారంగా వ్యాక్సిన్ తయారీ, ఉత్పత్తి, ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వటంపై దృష్టి పెట్టింది. కరోనాకు విరుగుడుగా కనిపెట్టిన ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే అమెరికా.. స్పుత్నిక్ వ్యాక్సిన్ వచ్చిన వెంటనే రష్యా లాంటి దేశాలు వెంటనే.. యుద్ధప్రాతిపదికన ఓ నిర్ణయం తీసుకున్నాయి. ఫైజర్, స్పుత్నిక్ వ్యాక్సిన్ తయారు చేసిన ఫైజర్, స్పుత్నిక్ కంపెనీలతో చర్చలు జరిపాయి. వ్యాక్సిన్ తయారీ సామర్థ్యం సరిపోదు కనుక.. ఆ ఫార్ములాతో ఇతర ఫ్యాక్టరీల్లో వ్యాక్సిన్ ఉత్పిత్తి జరిగే విధంగా.. మిగతా అన్ని కంపెనీలను ప్రభుత్వం ఒప్పించింది. దీంతో ప్రతిరోజు కోట్ల సంఖ్యలో వ్యాక్సిన్ బయటకు వచ్చింది.

భారతదేశంలో ప్రధానమంత్రి మోడీగారి విధానం, నిర్ణయాలు అందుకు భిన్నంగా ఎందుకు ఉన్నాయో ఇప్పటికీ ప్రపంచానికి అర్థం కావటం లేదు. కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచటానికి.. ఆ వ్యాక్సిన్ తయారు చేయటానికి కావాల్సిన ఎన్నో కంపెనీలు భారత్ లో అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్, సిప్లా, సన్ ఫార్మా, మెన్ కైండ్, బీఈ, అరబిందో, మ్యాట్రిక్స్, హెట్రో, బీవీకే, జీఎస్ కే వంటి ఎన్నో దిగ్గజ సంస్థలు ఉన్నాయి. ఆయా కంపెనీల్లో.. కోవీషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఎందుకు తయారు చేయటం లేదో ఇప్పటికీ ఎవరికీ అర్థం కావటం లేదు. అమెరికా, రష్యా, ఇంగ్లాండ్ తోపాటు ప్రపంచంలోని అన్ని దేశాలు చేస్తున్న పనిని భారత ప్రభుత్వం, ప్రధాని మోడీ ఎందుకు చేయటం లేదు.. రోజూ 4 వేల మంది కరోనాతో చనిపోతున్నా.. వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం అందుబాటులో ఉన్నా.. ఎందుకు ఉపయోగించుకోవటం లేదు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ఇందులో రాజకీయం ఏమీ లేదు.. అతి సామాన్యుడు.. మనిషి అన్నవాడికి వచ్చే ఆలోచన ఇది.. ఇదే జరిగితే.. నెల రోజుల్లోనే 20 కోట్ల వ్యాక్సిన్ డోసులు బయకు రావా ఏంటీ అనే మాట ప్రతి ఒక్కరితో ఉంది..

కుటుంబాలకు కుటుంబాలు నాశనం అవుతున్నాయి కరోనాతో.. ఈ టైంలోనూ ఇంత విశాల దృక్పధంతో ప్రభుత్వాలు, కంపెనీలు ఆలోచించకపోతే రాబోయే రోజుల్లో మనుషులకు కాకుండా.. శవాలకు, జంతువులకు వ్యాక్సిన్ వేసుకోవాలి ఇండియా అనే మాట.. ఆవేదనతో కూడిన మనుషుల నుంచి వస్తుంది.. నాశనం అయిపోక మానరు.. అన్యాయం చేసినోళ్లు.. చేస్తున్న వాళ్లు అని శాపనార్థాలు పెడుతున్నారు జనం..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు