అరెస్ట్ చేస్తారా సార్- చంద్రబాబుని : ఈసారి ఏకంగా ఆ కేసు పెట్టారు.. తప్పించుకోవటం కష్టమేనా..

chandrbabu naidu over corona virus

ఏపీలో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. వరస ఎన్నికల్లో ఓడిపోతూ వస్తున్న తెలుగుదేశం పార్టీకి.. ఇప్పుడు షాక్ తగింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై ఏకంగా నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదు చేస్తూ.. ఎఫ్ఐఆర్ చేశారు పోలీసులు.. ఇంతకీ కేసు ఏంటంటే..

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి, కేసులకు సంబంధించి జూమ్ లో మాట్లాడిన చంద్రబాబు.. రాష్ట్రంలో N440k వైరస్ ఉందని.. దీని వల్లే చనిపోతున్నారని.. ప్రజల్లో ఈ వైరస్ వల్ల భయాందోళనలకు గురవుతున్నారంటూ చెప్పారు. దీనిపై టీడీపీ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయితే వాస్తవానికి N440k రకం వైరస్ ఏపీలో లేదని.. దాని ఉనికి, వ్యాప్తి లేదని స్పష్టం చేసింది ఐసీఎంఆర్, ఇతర బయోలాజికల్ రిసెర్చ్ సంస్థలు. వైరస్ రూపు మార్చుకోవటం, మ్యుటేషన్ కావటం అనేది సహజం అని.. N440k వైరస్ ఏపీలో ఉన్నట్లు నిర్థారణ కాలేదని.. పరీక్షల్లో తేలలేదని రిపోర్ట్ ఇచ్చాయి ఆయా పరిశోధన సంస్థలు.

లేని వైరస్ గురించి చంద్రబాబు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని.. ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారంటూ కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రముఖ లాయర్ సుబ్బయ్య కంప్లయింట్ ఆధారంగా.. చంద్రబాబుపై 2005 ప్రకృతి వైపరీత్యాల చట్టంలోని సెక్షన్ 4 కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు కర్నూలు వన్ టౌన్ పోలీసులు. ఐపీసీ 155, 505(1)(బి)(2) సెక్షన్ల కింద.. సీఆర్ నెంబర్ 80/2021 ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసు నాన్ బెయిలబుల్ కిందకు వస్తుంది.

చంద్రబాబుపై ఈసారి నమోదైన కేసు ప్రకృతి వైపరీత్యాలు, భయాందోళనలకు సంబంధించినది కావటంతో అరెస్ట్ చేస్తారా ఏంటీ అనే సందేహాలు వినిపిస్తున్నాయి ప్రజల్లో. ప్రకృతి విపత్తుల సమయంలో తప్పుడు ప్రకటనలు, భయాందోళనలకు గురి చేయటం, ప్రజలను రెచ్చగొట్టటం వంటి వాటిని తీవ్రంగా పరిగణిస్తుంది చట్టం.

చంద్రబాబుపై పెట్టిన కేసును లైట్ తీసుకుంటుంది టీడీపీ.. ఎన్ని కేసులు పెట్టినా.. స్టే తెచ్చుకుంటాం.. ఏమీ పీకలేరు అంటూ అప్పుడే ఛాలెంజ్ చేస్తుంది టీడీపీ.. వెంట్రుక కూడా పీకలేరు అంటున్నారు నారా లోకేష్

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు