ఫుడ్ డెలివరీ బాయ్ గా మారిన యంగ్ క్రికెటర్ – ఎందుకో తెలిస్తే షాక్

అతనికి బైక్ కూడా లేదు తన సైకిల్ పైనే.. ఇంటింటికీ తిరిగి

కరోనా మహమ్మారి ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తుందో.. ప్రజల జీవన విధానాన్ని ఏ విధంగా దెబ్బ కొట్టిందో చెప్పటానికి ఇదో ఉదాహరణ. క్రికెట్ గ్రౌండ్ ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకోవాల్సిన అతను.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ బాయ్ మారి.. ఇంటింటికీ తిరిగి ఆహార పొట్లాలు అందిస్తూ ఉపాధి పొందుతున్నాడు. వివరాల్లోకి వెళితే..

నెదర్లాండ్ క్రికెట్ జట్టు తరపున 27 ఏళ్ల పాల్ వ్యాన్ బౌలర్ గా ఆడుతున్నాడు. 2019లో జింబాబ్వే జట్టుతో అతను చివరి మ్యాచ్ ఆడాడు. నెదర్లాండ్ లోకల్ జట్టులో ఆడుతూ ఉన్నాడు. మార్చి నెలలో కరోనా పుట్టినప్పటి నుంచి క్రికెట్ కు దూరం అయ్యాడు.
దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లు కూడా నిర్వహించటం లేదు నెదర్లాండ్ దేశం. దీంతో వచ్చే కొంచెం ఆదాయం కూడా పోయింది. ఉద్యోగం దొరకలేదు.

జీవితాన్ని నెట్టుకురావటం కోసం ఫుడ్ డెలివరీ బాయ్ గా మారాడు. అతనికి బైక్ కూడా లేదు
తన సైకిల్ పైనే.. ఇంటింటికీ తిరిగి ఫుడ్ ఆర్డర్లు సప్లయ్ చేస్తూ ఉపాధి పొందుతున్నాడు.
ప్రస్తతం చలికాలం నడుస్తుంది.. మరో నాలుగు నెలలు క్రికెట్ ఆట కూడా ఉండదు. దీంతో ఉబెర్ ఈట్స్ తరపున డెలివరీ బాయ్ గా ఉపాధి పొందుతున్నాడు

యంగ్ క్రికెటర్ జీవితాన్ని కరోనా ఏ విధంగా మర్చేసిందో అంటూ నెటిజన్లు బాధ వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం ఉపాధి చిన్నదా పెద్దదా అని కాదు.. తన కాళ్లపై తాను నిలబడినందుకు మరికొందరు అభినందనలు చెబతుున్నారు.

 

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు