చెన్నై సూపర్ కింగ్స్ కి కొత్త కెప్టెన్, ధోని పక్కకు వెళ్తారా?

చెన్నై సూపర్ కింగ్స్ కి కొత్త కెప్టెన్, ధోని పక్కకు వెళ్తారా?

చెన్నై సూపర్ కింగ్స్, ఐపీఎల్ లో తోపు జట్టు అని చెప్పవచ్చు.. కానీ ఈ ఏడాది ఈ జట్టు రాణించలేకపోయింది. రైనా టోర్నీ ప్రారంభానికి ముందే నిష్క్రమించడంతో జట్టు మంచి బ్యాట్స్ మెన్ ను కోల్పోయింది. ఇక హర్భజన్ కూడా టోర్నీ ప్రారంభం కాకముందే ఇండియాకి వచ్చేశాడు. భారం మొత్తం కెప్టెన్ ధోనీపైనే పడింది.

జట్టులో కీలక ఆటగాళ్లు పోవడంతో ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నై జట్టు గోరంగా విఫలమైంది. దింతో చెన్నై అభిమానులు ధోనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కెప్టెన్సీ నుంచి ధోనిని తప్పుకోవాలని అభిమానులు కోరారు.. ఇది ఇలా ఉంటే వచ్చే ఐపీఎల్ కు ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ధోని స్థానంలో సౌత్ ఆఫ్రికా ఆటగాడు డుప్లెసిస్‌ కి పగ్గాలు అప్పగించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ విషయంపై టీమిండియా బ్యాటింగ్‌ మాజీ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ మాట్లాడుతూ.. డుప్లెసిస్‌ కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. కాగా వచ్చే సీజన్ లో ధోని ఆడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కు ధోని గుడ్ బాయ్ చెప్పారు. ఇక ఐపీఎల్ కు కూడా చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు