రేప్ చేస్తే అది కట్ చేస్తారు – కొత్త చట్టం తీసుకురానున్న దేశం

రేప్ చేస్తే అది కట్ చేస్తారు - కొత్త చట్టం తీసుకురానున్న దేశం : పౌరులకు రక్షణ కల్పించడమే తమ తొలి ప్రాధాన్యం అని.. ప్రధాని వెల్లడిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.

ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. ఎన్ని శిక్షలు వేసినా.. చిన్నారులు, అమ్మాయిలపై లైంగిక దాడులు ఆగడం లేదు. ఈ పైశాచిక దాడులను ఎదుర్కొంటూ.. చాలామంది మహిళలు జీవితాలను నెట్టుకొస్తున్నారు. ఇలాంటి సందర్భంలో మన దాయాది పాకిస్తాన్‌.. కఠిన చట్టాన్ని రూపొందించేందుకు సిద్ధమైంది. ఆ దేశ స్థానిక ఛానెల్‌ టీవీ.. ఈ విషయాన్ని వెల్లడించింది.

కొత్త చట్టంలో భాగంగా రేపిస్టులకు లైంగిక పటుత్వం తగ్గేలా ఆపరేషన్లు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా.. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. దీనిపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలు రూపొందించేందుకు సిద్ధమైంది.

రేపిస్టులను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ..

అత్యాచార నిరోధక కార్యకలాపాల్లో మహిళలను పెద్ద సంఖ్యలో భాగస్వామ్యం చేయడం.. సాక్షులకు రక్షణ కల్పించడం.. రేప్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించడం.. అంతేకాకుండా బాధితులు, సాక్షుల వివరాలు బహిర్గతం కాకుండా జాగ్రత్త పడటం వంటి కార్యక్రమాలను రూపొందించారు. దీనికి సంబంధించిన బిల్లుకు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌.. ఆమోదించినట్లు ప్రముఖ న్యూస్ ఛానల్ వెల్లడించింది.

చాలా కాలంగా పాకిస్తాన్‌లో మహిళలపై దారుణాలు పెరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం లాహోర్‌లో ఏడేళ్ల బాలిక అత్యాచారం, హత్యతో పాటు.. ఇటీవల ఓ మహిళపై సామూహిక లైంగిక దాడి ఘటనలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఇమ్రాన్ సర్కారు కఠినమైన నిర్ణయంవైపు అడుగులు వేసింది. పౌరులకు రక్షణ కల్పించడమే తమ తొలి ప్రాధాన్యం అని.. ప్రధాని వెల్లడిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.

ఈ బిల్లు తయారీ క్రమంలో.. ఇమ్రాన్‌ కేబినెట్‌ మంత్రులు కొందరు తీవ్రమైన ప్రతిపాదనలు చేశారు. రేపిస్టులను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ.. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేసినట్లు తెలిసింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు