సైబరాబాద్ లో ట్రాఫిక్ చలాన్ల వసూలు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

సైబరాబాద్ లో ట్రాఫిక్ చలాన్ల వసూలు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.. అందరూ విడ్డూరంగా చూశారు.. ఇప్పటి లెక్కలు చూస్తే అర్థం అవుతుంది.. ఎందుకు ఆయన అన్నారో.. ఆయన అన్న మాటలకు ఎందుకు యూత్ నుంచి అంత మద్దతు వచ్చిందో అని..

New record in Hyderabad traffic challan Collection
New record in Hyderabad

ట్రాఫిక్ పోలీసుల చేతుల్లో లాఠీలు పోయి.. కెమెరాలు వచ్చిన తర్వాత ప్రభుత్వానికి పండగ అయ్యింది అనటంలో సందేహం లేదని ఈ లెక్కలు చెబుతున్నారు. 2019, 2020 రెండు సంవత్సరాల్లో.. ఒక్క సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ట్రాఫిక్ చలాన్లతో పోలీసులు వసూలు చేసిన మొత్తం 165 కోట్ల రూపాయలు. సైబరాబాద్ పోలీసులు.. వాహనదారుల నుంచి వసూలు చేసి మొత్తం ఇది.

మద్యం తాగి వాహనాలు నడిపిన 3 వేల 551 మంది లైసెన్సులు రద్దు చేస్తే.. డ్రంక్ అండ్ డ్రైవ్ లో 42 మంది మహిళలపై కేసులు నమోదు అయ్యాయి. మద్యం తాగి పోలీసులకు చిక్కిన విద్యార్థులు 854 మంది ఉంటే.. 75 మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, 2 వేల 431 మంది వ్యాపారవేత్తలు ఉన్నారు. ఇక 6 వేల 340 మంది ప్రైవేట్, 222 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తోపాటు ఇతర వాహనచట్టం కింద కేసులు నమోదు అయ్యాయి.

ఇది ఒక్క సైబరాబాద్ లెక్క అయితే.. రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఇంకెన్ని వందల కోట్ల రూపాయలు వాహనదారులు నుంచి వసూలు చేసి ఉంటారో అనే ప్రశ్నే ఊహకు అందటం లేదు.
ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్రాఫిక్ చలాన్ల మీద మాట్లాడితే అందరూ విడ్డూరంగా చూశారు.. ఇప్పటి లెక్కలు చూస్తే అర్థం అవుతుంది.. ఎందుకు ఆయన అన్నారో.. ఆయన అన్న మాటలకు ఎందుకు యూత్ నుంచి అంత మద్దతు వచ్చిందో అని..

హైదరాబాద్ లో బండి అమ్మాలి అంటే.. ఆ వచ్చే డబ్బులతో ట్రాఫిక్ చలాన్లకు సరిపోతుందనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఏది ఏమైనా వచ్చే ఏడాదికి సైబరాబాద్ 200 కోట్ల రూపాయల చలాన్ల మార్క్ ను దాటినా ఆశ్చర్యం లేదు..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు