తెలంగాణలో ఇవాల్టి నుంచి నైట్ కర్ఫ్యూ

తెలంగాణలో ఇవాల్టి నుంచి నైట్ కర్ఫ్యూ

కరోనా కట్టడి, వైరస్ వ్యాప్తి విషయాలపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. హైకోర్టు ఆదేశాలతో యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది. ఏప్రిల్ 20వ తేదీ రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది.

ఏప్రిల్ 20వ తేదీ మంగళవారం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. మే ఒకటో తేదీ వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుంది. మెడికల్ ఎమర్జెన్సీ అయితే అనుమతి ఇస్తారు.

నైట్ కర్ఫ్యూ అమలు చేయటంతో.. ఇక నుంచి ధియేటర్లలో సెకండ్ షో రద్దు కానుంది. మాల్స్, దుకాణాలు, బార్లు, పబ్స్, వైన్ షాపులు, కూరగాయల షాపులు అన్నీ కూడా రాత్రి 8 గంటల కల్లా మూసి వేయనున్నారు.ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు.. ఇప్పటికే బస్సు, రైలు, విమాన టికెట్లు బుక్ చేసుకున్న వారు.. వారి టికెట్లు చూపిస్తే అనుమతిస్తారు.

ఈ-కామర్స్, ఆన్ లైన్ డెలివరీ, ఫుడ్ డెలివరీ, ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసులు, పెట్రోల్ బంకులు, మీడియా సిబ్బందికి మినహాయింపు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.

night curfew in Telangana from today

See also : యాక్టివ్ సీఎంగా కేటీఆర్ : పార్టీతోపాటు ప్రభుత్వ సమీక్షల్లో యువరాజు

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు