ప్రపంచంలోని అతిపెద్ద రాజకోటలో నీహారిక వెడ్డింగ్

ఆసియాలోనే టాప్‌, వరల్డ్‌ లెవెల్‌లోనే 5వ ప్లేస్‌లో ఉన్న రాజస్థాన్‌లోని

మెగా బ్రదర్ నాగబాబు డాటర్‌.. నిహారిక, ఛైతన్యల వివాహ వేదిక ఫిక్స్ అయ్యింది. ఆసియాలోనే టాప్‌, వరల్డ్‌ లెవెల్‌లోనే 5వ ప్లేస్‌లో ఉన్న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో వెడ్డింగ్ సెర్మనీ నిర్వహించాలని.. ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. ముందు నుంచీ డెస్టినేషన్ వెడ్డింగ్ అని ప్రకటించిన ఇరు కుటుంబాలు.. చివరకు ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌ను ఫిక్స్ చేశారు. డిసెంబర్ 9న రాత్రి 7 గంటలా 15 నిమిషాలకు జరగనున్న ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే కాబోయే వధూవరులు అక్కడికి చేరుకున్నారు.

కరోనా కారణంగా.. ఆగస్టులో ఎంగేజ్‌మెంట్‌ ను సాధారణంగా నిర్వహించారు. మెగా ఫ్యామిలీ నుంచి చాలాకాలం తర్వాత జరుగుతున్న వివాహం కావడంతో.. అదే రేంజ్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు రోజుల పాటు గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్లు చేస్తున్నారు. కరోనా కారణంగా.. పెళ్లికి కూడా అతికొద్ది మంది అతిథులను మాత్రమే ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాలకు చెందిన వారితో పాటు.. కొద్ది మంది ప్రముఖులకే ఇన్విటేషన్లు ఇస్తారని చెబుతున్నారు.

రీసెంట్‌గా కాబోయే భర్త చైతన్యతో కలిసి నిహారిక తన ఇంట్లో దీపావళి వేడుకలు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. అంతకుముందు.. గోవా బీచుల్లో తన ఫ్రెండ్స్‌తో కలిసి బ్యాచ్‌లర్‌ పార్టీ చేసుకున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం నిహారిక, ఛైతన్య ఉదయ్‌పూర్‌ వీధుల్లో విహరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మెగా కాంపౌండ్ నుంచి ఫస్ట్‌ హీరోయిన్‌గా వచ్చిన నిహారిక.. తన క్యూట్ స్మైల్‌తో.. ఫ్యాన్స్‌ను అలరించింది. ఒక మ‌న‌సు, హ్యాపీ వెడ్డింగ్‌, సూర్యకాంతం, సైరా వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య మూవీలో.. చిన్న రోల్‌లో కనిపిస్తుందని తెలుస్తోంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు