రాష్ట్రంలో కరోనా లేదు.. ప్రభుత్వం సాకులు చెబుతోంది.. నోటిఫికేషన్ పై నిమ్మగడ్డ వెర్షన్

రాష్ట్రంలో కరోనా లేదు.. ప్రభుత్వం సాకులు చెబుతోంది.. నోటిఫికేషన్ పై నిమ్మగడ్డ వెర్షన్

వచ్చే ఫిబ్రవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామంటూ మళ్లీ ప్రొసీడింగ్స్ జారీ చేశారు ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. అందుకు తగ్గట్టుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ కారణంగా ఎన్నికలు నిర్వహించలేమని చెబుతున్నదని.. అయితే అవన్నీ కుంటిసాకులే అన్నారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్. కరోనా సెకండ్ వేవ్ అనేది కుంటిసాకు మాత్రమే అని.. అలాంటి భయానక పరిస్థితులు ఏమీ లేవని స్పష్టం చేశారు నిమ్మగడ్డ.

ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని గతంలో ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిందని.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వంతో ఎన్నికల కమిషన్ సంప్రదింపులు నిర్వహించిందని తెలిపారు.

జాతీయ, అంతర్జాతీయంగా కరోనా, వ్యాక్సిన్ పరిస్థితులను ఎన్నికల కమిషన్ నిశితంగా గమనించిందన్న నిమ్మగడ్డ.. ప్రభుత్వం కొత్త పథకాలు ప్రారంభించే ముందు ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోమని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయలేదన్నారు.

కరోనా సెకండ్ వేవ్ వస్తుందనే సాకుతో ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం కోరుతుందన్నారు.. రాష్ట్రంలో అటువంటి పరిస్థితి లేదు.. భయానక పరిస్థితులున్న అమెరికాలోనే ఎన్నికలు జరిగాయంటున్నారు నిమ్మగడ్డ.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు