ఈ ప్రశ్నలకు సమాధానం లేకుండానే నిమ్మగడ్డ పదవీ విరమణ

ఈ ప్రశ్నలకు సమాధానం లేకుండానే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ విరమణ చేస్తున్నారు.కమిషనర్ హోదాలో చివరి ప్రెస్ మీట్ పెట్టినా.. తాను చెప్పాలనుకున్నదే చెప్పారు కానీ.. సశేషంగా మిగిలి పోయిన.. ప్రజల్లో అనుమానం ఉన్న అనేక ప్రశ్నలు...

ఈ ప్రశ్నలకు సమాధానం లేకుండానే నిమ్మగడ్డ పదవీ విరమణ

ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మార్చి 31వ తేదీతో పదవీ విరమణ చేశారు. కమిషనర్ హోదాలో చివరి ప్రెస్ మీట్ పెట్టినా.. తాను చెప్పాలనుకున్నదే చెప్పారు కానీ.. సశేషంగా మిగిలి పోయిన.. ప్రజల్లో అనుమానం ఉన్న అనేక ప్రశ్నలు, సందేహాలకు మాత్రం సమాదానం చెప్పకుండానే వెళ్లిపోయారు. ఇక నుంచి సాధారణ పౌరుడిని అని.. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన ఆయన.. ఈ ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పలేదు అని తెలుగు ప్రజలను తొలుస్తుంది.

  1. ఎన్నికల సంఘం కమిషనర్ గా ఉండి.. సీఎం జగన్ పై కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారు. దీనిపై సీఐడీ విచారణ జరుగుతుంది. ఇంతకీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సీఎం జగన్ పై కేంద్ర హోంశాఖకు లేఖ రాశారా లేదా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు.
  2. సీఎం జగన్ ఫ్యాక్షన్ తరహాలో వ్యవహరిస్తున్నారంటూ కేంద్ర హోం శాఖకు మెయిల్ చేశారు. ఇది టీడీపీ అనుకూల పత్రిక నుంచి నిమ్మగడ్డకు వచ్చిందని.. దాన్ని ఆయన నేరుగా కేంద్ర హోం మంత్రికి పంపించారని సీఐడీ విచారణ చేస్తుంది. ఇది నిజమా కాదా..
  3. ఏపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై కేంద్ర హోం శాఖకు లేఖ రాసిన వివాదంపై సీఐడీ చేసిన విచారణ వివరాలు, సేకరించిన ఆధారాలు నాకు అందించాలని సీఐడీని నిమ్మగడ్డ కోరిన విషయం నిజమా కాదా..
  4. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం అంటూ పదేపదే నిజాయితీ గురించి మాట్లాడే నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో ఎంపీ సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్ తో ప్రత్యేకంగా ఎందుకు భేటీ అయ్యారు.. ఏం చర్చించారు అనేది మాత్రం చెప్పటం లేదు. ఆఫీసులోనో.. ఇంట్లోనో సమావేశం కావొచ్చు కదా.. ఫైవ్ స్టార్ హోటల్ లో ఎంతో సీక్రెట్ గా భేటీ కావాల్సిన అవసరం ఏంటీ అనే దానికి మాత్రం సమాధానం చెప్పలేదు.
  5. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను వాయిదా వేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో కనీసం స్పందించలేదని ప్రభుత్వం హైకోర్టులో కూడా చెప్పింది.. ఏకపక్షంగా.. రాత్రికి రాత్రి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అంటే మాత్రం సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు
  6. ముందుగా ప్రకటించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ షెడ్యూల్ ను పక్కనపెట్టి.. పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు ఎందుకు నిర్వహించారు అంటే సమాధానం ఉండదు. ఎన్నికల సంఘాన్ని ఎవరూ ప్రశ్నించకూడదు అంటారు.
  7. పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్ ముగిశాయి కదా.. ఆరు రోజుల్లో అయిపోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వరు అంటే.. అంతా నా ఇష్టం.. నన్ను ఎవరూ ప్రశ్నించకూడదు అంటారు.
  8. నా ఓటు నేను వేసుకోలేకపోయాను.. దీని కోసం హైకోర్టులో పోరాడతాను అంటారు.. 3 లక్షల 40 వేల మంది ఓటు హక్కు కోల్పోయారు.. వారి ఓట్లు నమోదు తర్వాత షెడ్యూల్ ఇవ్వొచ్చు కదా అంటే.. సమాధానం ఉండదు.

ఒకటి కాదు.. ఇలాంటి వందల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా.. సమాధానం చెప్పలేక పదవీ విరమణ చేశారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్. నిమ్మగడ్డ రాజ్యాంగం ఓ కొత్త బుక్ లెట్ రిలీజ్ చేసి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు