నిమ్మగడ్డ పెట్టిన ఆ చివరి సంతకం.. కొత్త చరిత్రను రాసింది

నిమ్మగడ్డ పెట్టిన ఆ చివరి సంతకం.. కొత్త చరిత్రను రాసింది

Nimmagadda ramesh kumar last signature

నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్. పదవీ విరమణ తర్వాత సైతం అతన్ని తలచుకోవటం అంటే మాటలు కాదు.. దీనికి కారణం లేకపోలేదు. దేశ ఎన్నికల చరిత్రను తిరగరాసిన.. కొత్త తీర్పులకు నాంది పలికారు అతను. ఓ ప్రభుత్వంపై పోరాడి ఎన్నికలు నిర్వహించిన చరిత్ర అతనిది అయితే.. రిటైర్ అయిన తర్వాత సైతం.. అతను పెట్టిన ఒకే ఒక్క సంతకం జెడ్పీ ఎన్నికలను నిలిపవేసింది.

అవును.. ఇది అక్షరాల నిజం. దేశ చరిత్రలో పోలింగ్ కు 36 గంటల ముందు ఎన్నికలపై హైకోర్టు స్టే ఇవ్వటం ఫస్ట్ టైం. దీనికి కారణం ఏంటో తెలుసా.. తన పదవీ విరమణ చివరి రోజుల్లో అంటే.. మార్చి 26వ తేదీ తర్వాత నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పెట్టిన ఓ సంతకం. జెడ్పీ ఎన్నికలను నా హయాంలో నిర్వహించలేను అని ప్రకటిస్తూ.. స్థానిక సంస్థలపై ఉన్న ఉన్న ఎన్నికల కోడ్ ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇక్కడ విశేషం ఏంటేంట.. కోడ్ ఎత్తివేతకు ముందే.. జెడ్పీ ఎన్నికలు నిర్వహించాలని.. కోడ్ కొనసాగించాలని ప్రభుత్వం లేఖ రాయటంతోపాటు.. స్వయంగా కలిసి విన్నవించింది ప్రభుత్వం. అయినా తన చేతిలో ఉన్న పవర్ తో.. జెడ్పీ ఎన్నికలను నిర్వహించకపోగా.. ఏకంగా ఎన్నికల కోడ్ ఎత్తివేస్తూ సంతకం పెట్టారు.

కోడ్ ఎత్తివేస్తూ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పెట్టిన సంతకాన్ని ఆసరా తీసుకునే.. తెలుగుదేశం పార్టీ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఎన్నికల కోడ్ విధించిన తర్వాత పోలింగ్ నిర్వహించటానికి నాలుగు వారాల గడువు ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో చంద్రబాబు ఈ వ్యూహాన్ని పన్ని హైకోర్టుకు వెళ్లారు.

అప్పటికే పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలను పూర్తి చేసిన నిమ్మగడ్డ.. ప్రభుత్వ విజ్ణప్తిని, డిమాండ్ ను, కరోనా వ్యాప్తి అంశాలను పక్కనపెట్టి మరీ.. కోడ్ ఎత్తివేస్తూ సంతకం చేశారు. అంటే.. నిమ్మగడ్డ సంతకం పెట్టటం.. దానిపై టీడీపీ కోర్టుకు వెళ్లటం.. హైకోర్టు సింగిల్ బెంచ్ పోలింగ్ కు 36 గంటల ముందు స్టే విధించటం అంతా చకా చకా జరిగిపోయాయి..

మొత్తానికి నిమ్మగడ్డ పెట్టిన చివరి సంతకం.. దేశ ఎన్నికల చరిత్రలో కొత్త తీర్పుకు.. కొత్త చరిత్రకు నాంది అయ్యింది. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ ఏ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ లా వ్యవహరించకపోవటం కూడా ఓ చరిత్రే. కుట్రలు, కుతంత్రాలు, ఓ పార్టీకి తొత్తుగా వ్యవహరించటం అనే రాజకీయ పార్టీల కామెంట్లు అనేవి మరో అంశం అనుకోండి.

See also : ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకోవాల్సింది – ప్రజల్లో ఉన్న సానుభూతి కాస్త పోయింది : పనబాక లక్ష్మి

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు