నిమ్మగడ్డ భావోద్వేగం : నేనేనా ఎన్నికలు పెట్టింది -కేంద్రం పెట్టలేదా

కరోనా వ్యాప్తికి, సెకండ్ వేవ్ కు కారణం అయిన ఎన్నికల సంఘంపై హత్య కేసులు పెట్టాలి అంటూ మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యల క్రమంలో.. ఏపీలో కరోనా కేసుల పెరుగుదలకు అప్పటి రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. అందుకు వంత పాడిన తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ రాజకీయంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మీమ్స్, కామెంట్లు నిమ్మగడ్డనే కారణం అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. రెండు రోజులుగా ఇది ప్రతి ఇంట్లో చర్చకు దారి తీసింది.

ఈ క్రమంలో రాజ్యాంగ విలువలను విపరీతంగా గౌరవించే నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. తనపై వస్తున్న విమర్శలు, ఆరోపణలపై ఆప్తుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారంట. ఏపీలో కరోనా వైరస్ పూర్తిగా కట్టడి అయిన సమయంలో.. ఎన్నికలు పెట్టిన మాట వాస్తవమే.. ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ వద్దన్నా.. వ్యాక్సిన్ ప్రక్రియతో సంబంధం లేదని ఎన్నికలు పెట్టిన మాట వాస్తవమే. ఇప్పుడు కరోనా కేసులు పెరిగాయని.. నన్ను నిందిస్తూ.. కరోనాతో చావులకు నేనే కారణం అంటుంటే బాధేస్తుంది అని బాధపడ్డారంట.

దేశంలో ఎన్నికలు పెట్టింది నేను ఒక్కడినేనా ఏంటీ.. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం పెట్టలేదా ఏంటీ.. ఐదు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా.. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు పెట్టలేదా.. నన్ను ఒక్కడితే ఎందుకు ఇలా ఆడిపోసుకుంటున్నారు అంటూ భావోద్వేగానికి గురయ్యారంట నిమ్మగడ్డ రమేశ్ కుమార్. ఏపీలో కరోనా కేసులకు, చావులకు నన్ను నిందిస్తే.. ప్రధాని మోడీని నిందించినట్లే.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిందించినట్లే అంటున్నారంట ఆప్తుల దగ్గర.

కాకపోతే ఇక్కడ ఓ పాయింట్ మిస్ అయ్యారు నిమ్మగడ్డ రమేశ్. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, అంతకు ముందు ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం ఓకే అన్నది నిజమే.. కాకపోతే ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్.. రాష్ట్ర ప్రభుత్వం వద్దని చెప్పింది.. దీనికితోడు అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం అయితే 2018లోనే జరగాల్సిన ఎన్నికలు.. కరోనా ఉందని 2020లో మధ్యలో వాయిదా వేశారు.. ఇప్పడు వద్దని చెప్పినా పెట్టారు.. ఈ విషయాన్ని ఏమీ చెప్పకుండా ఆప్తులు దగ్గర భావోద్వేగానికి గురయ్యారంట నిమ్మగడ్డ రమేశ్ కుమార్..

తప్పు చేశామని అనిపిస్తే.. పశ్చాత్తాపం ఉంటుంది కదా.. ప్రతి మనిషి తన చివరి రోజుల్లో చేసే మంచి, చెడులే ఆయన చనిపోయిన తర్వాత మిగిలి ఉంటాయి.. ఎగ్జాంపుల్స్ ఎన్నో కదా.

ఇది చూడండి : అయితే ఇప్పుడు నిమ్మగడ్డపై హత్య కేసు పెడతారా : మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలతో ఏపీలో ఇదే ఇప్పుడు చర్చ 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు