సీఎం జగన్ ఎత్తుగడలో చిత్తయిన నిమ్మగడ్డ – వీడియో కాన్ఫరెన్స్ సమయానికి షాక్

కార్యాలయంలో వెయిట్ చేసి.. ఇక ఏ అధికారి రారు అని డిసైడ్ అయిన తర్వాత.. తీరిగ్గా 4 గంటలకు

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, సాధ్యాసాద్యాలపై కలెక్టర్లు, ఎస్పీలతో మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ అని సమాచారం ఇచ్చారు. అయితే ఈ అంశంపైనే ఏపీ సీఎస్ నీలం సాహ్ని నిమ్మగడ్డకు లేఖ రాశారు. ఎన్నికలు సాధ్యం కాదని.. అధికార యంత్రాంగం అంతా బిజీగా ఉంది అని స్పష్టం చేశారు. ఇవేమీ పట్టన నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ఉదయం గవర్నర్ తో భేటీ తర్వాత నేరుగా ఎన్నికల కార్యాలయం దగ్గరకు వచ్చారు.

జిల్లా ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ పై అప్పటికే సీఎస్ అభ్యంతరం తెలిపి ఉన్నా.. కార్యాలయంలో వెయిట్ చేశారంట. అయితే ఇదే సమయంలో సీఎం జగన్ తాడేపల్లిలోని తన క్యాంప్ ఆఫీస్ నుంచి జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారులతో కరోనా అంశంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా సెకండ్ వేవ్ వస్తుందని.. అప్రమత్తంగా ఉండాలని.. గంటకు పైగానే ప్రజారోగ్యంపై ఆయా జిల్లాల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.

ఓ వైపు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ వీడియో కాన్ఫరెన్స్ కు సిద్ధంగా ఉన్నా.. జిల్లా ఉన్నతాధికారులు అందరూ సీఎం జగన్ రివ్యూ మీటింగ్ కు కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే సీఎస్ అధికారిక ఆదేశాలు ఉండటమే దీనికి కారణం. కార్యాలయంలో వెయిట్ చేసి.. ఇక ఏ అధికారి రారు అని డిసైడ్ అయిన తర్వాత.. తీరిగ్గా 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ రద్దు అని ప్రకటించి వెళ్లిపోయారు రమేశ్ కుమార్.

సీఎస్ అభ్యంతరంతో వీడియో కాన్ఫరెన్స్ రద్దు చేసుకున్నట్లయితే.. గవర్నర్ తో భేటీ తర్వాత మధ్యాహ్నం ఏ 12 గంటలకో.. ఒంటి గంటకో ప్రకటించొచ్చు కదా.. అలా కాకుండా 4 గంటలకు ప్రకటించటం వెనక అర్థం ఇదే అంటున్నారు. సీఎస్ అభ్యంతరం వ్యక్తం చేసిన క్రమంలో అని చెబుతున్నా.. సీఎం జగన్ కరోనాపై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఎత్తుగడతో.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యూహం ఫలించలేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

గవర్నర్ తో భేటీ తర్వాత నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గారు కొంచెం డల్ అయ్యారని.. ఆయన టీ, కాఫీలు అందించే ఆఫీస్ సిబ్బంది చెవులు కొరుక్కోవటం విశేషం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు