మా నిమ్మగడ్డ ఉండి ఉంటే తిరుపతి ఎన్నిక వాయిదా పడేది

తిరుపతి ఉప ఎన్నిక రాజకీయాల్లో మంచి ఊపును తీసుకొస్తే.. ప్రజల్లో మాత్రం భయాందోళనలకు కారణం అవుతుంది. అదే మా నిమ్మగడ్డ ఉంటేనే తిరుపతి ఉప ఎన్నిక వాయిదా పడేది.. అమ్మతోడు.. ఇప్పుడు తిరుపతిలో ఇదే టాక్ నడుస్తుంది.. దీనికి కారణం ఏంటో తెలుసా.

తిరుపతి కరోనా కేసులు భయంకరంగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ 9వ తేదీ విడుదల అయిన కరోనా బులిటెన్ లో.. తిరుపతిలో ఏప్రిల్ 8వ తేదీ ఒక్క రోజే 223 కొత్త కేసులు నమోదయ్యాయి. దీనికి కారణం ఉప ఎన్నిక. ఐదు పార్టీలు తమ ప్రచారంలో వేలాది మందిని వేసుకుని ఇంటింటికీ తిరుగుతున్నాయి. ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. పార్టీలు ఇస్తున్నాయి.. కనీసం కంట్రోల్ లేకుండా పోయింది.

కరోనా నిబంధనలు ఎక్కడా పాటించటం లేదు తిరుపతిలో. పొలిటికల్ పార్టీల ర్యాలీలు కావటంతో మాస్క్ పెట్టుకోకపోయినా అడిగే నాధుడే లేడు.. ఇక గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. పార్టీ జెండాలు పట్టుకుని ఇంటింటికీ తిరుగుతున్నారు. ఎవరికి కరోనా ఉందో.. ఎవరికి లేదో కూడా తెలియటం లేదు.

అధికారులు యాక్షన్ తీసుకుందాం అనుకుంటే.. రాజకీయంగా ఎక్కడ దుమారం రేగుతుందో అని టెన్షన్. ఇక రోడ్ షోలతో.. వేలాది మంది ఒకేచోట గంటల తరబడి ఉంటున్నారు.. దీంతో తిరుపతి లోక్ సభ నియోజకవర్గంలో కరోనా కేసుల వ్యాప్తి జోరుగా ఉంది. ఏప్రిల్ 8వ తేదీ గురువారం ఒక్క రోజే 223 కొత్త కరోనా కేసులు నమోదు కావటంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

అదే మా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా ఉండి ఉంటే.. ఈ పాటికి కరోనా ఉందని ఎన్నికలు వాయిదా వేసేవారు.. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోయే అంటూ చర్చించుకుంటున్నారు. ఇన్నిన్ని కొత్త కేసులు వస్తున్నాయి అంటే.. లక్షణాలు లేకుండా కరోనాతో తిరుగుతున్న వారు ఇంకెంత మందో కదా.. అదే ఇప్పుడు తిరుపతి ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది.

మా నిమ్మగడ్డ సార్ ఉంటేనే.. కరోనాతో ఎన్నికలు వాయిదా వేసి ప్రజల ప్రాణాలను కాపాడేవారు.. ఆయనకు ప్రజా ఆరోగ్యంపై అంత నిబద్ధత, శ్రద్ధ అంటున్నారు తిరుపతి జనం. అప్పట్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాతే కదా.. పోలింగ్ వాయిదా వేసింది.. అదే ఆయన ఉండి ఉంటే.. ఇప్పుడు కూడా వాయిదా పడేది తిరుపతి పోలింగ్ అంటున్నారు.. ఏమైనా జనంలో నిమ్మగడ్డ వేసిన ముద్ర మామూలుగా లేదు కదా…

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక అనేది కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉంటుంది.. ఇది రాష్ట్రంతో సంబంధం లేదు.. అయినా కూడా ప్రజలు ఈ విధంగా చర్చించుకోవటం విశేషం..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు