టాస్ గెలిచిన నిమ్మగడ్డ.. మ్యాచ్ ఎవరు గెలుస్తారు.. ఏపీలో ఉత్కంఠ

టాస్ గెలిచిన నిమ్మగడ్డ.. మ్యాచ్ ఎవరు గెలుస్తారు.. ఏపీలో ఉత్కంఠ.. తెలుగుదేశం పార్టీ మాత్రం చాలా హ్యాపీగా ఉంది.. ఇప్పటికే నామినేషన్ల పత్రాలతో ఆఫీసులకు వెళ్లిన విషయం తెలిసిందే.

రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్ విడుదల అయ్యిందని.. ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వాదనలను సమర్ధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన క్రమంలో.. ఏపీలో పంచాయతీ ఎన్నికల సమరం మొదలైంది. సుప్రీంకోర్టు సైతం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో.. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆప్షన్స్ అన్నీ అయిపోయాయి. ఇక ఎన్నికలకు ఎదుర్కోవటమే మిగిలింది.

ఎన్నికల నిర్వహణలో టాస్ గెలిచిన నిమ్మగడ్డ.. మ్యాచ్ ఎలా ఆడతారు అనేది అందరిలో ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే ఇద్దరు కలెక్టర్లు, ఓ ఎస్పీ. డీఎస్సీలు, సీఐలను తొలగించాలని ఆదేశించారు. దీనిపై సీఎస్, డీజీపీ చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు మళ్లీ బంతి ఎస్ఈసీ చేతిలోకి రావటంతో.. ఇప్పుడు వాళ్లను విధుల నుంచి తొలగిస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది. టాస్ గెలవటంలోనే యుద్ధం చేసిన నిమ్మగడ్డ.. మ్యాచ్ ను ఇంకెంత రసవత్తరంగా నడుపుతారు అనేది అందరిలో ఉత్కంఠ నెలకొంది.

సుప్రీంకోర్టు సైతం ప్రభుత్వ వాదనలను అంగీకరించలేదు అంటే.. ఎన్నికల సంఘానికి ఎంత పవర్ ఉందో అర్థం అవుతుంది. ఈ క్రమంలోనే.. మ్యాచ్ ఎవరు గెలుస్తారు.. నిమ్మగడ్డ ఎలా గెలిపిస్తారు.. ఇంకా ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది. తెలుగుదేశం పార్టీ మాత్రం చాలా హ్యాపీగా ఉంది.. ఇప్పటికే నామినేషన్ల పత్రాలతో ఆఫీసులకు వెళ్లిన విషయం తెలిసిందే.

టాస్ నిమ్మగడ్డ గెలిచినా.. టీడీపీ హ్యాపీగా ఉంది అంటే.. మ్యాచ్ ఎవరు గెలుస్తారు.. వైసీపీ 151 నియోజకవర్గాల్లోనూ టీడీపీ సత్తా చాటుతుందా.. లేక పంచాయతీ ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందా.. పట్టు నిలుపుకుంటుందా లేదా అనేది చూడాలి.

మొత్తానికి టాస్ గెలిచిన నిమ్మగడ్డ.. మ్యాచ్ ప్రారంభించారు.. టెస్ట్ మ్యాచ్ విజయం ఎవరిది..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు