నిర్మాణ్ ఫౌండేషన్ నిబద్ధతే – టీడీపీ గెలుపునకు బలం – చందానగర్ ఓటర్ల మాట

డివిజన్ లోని పేదల ఇంట్లో కష్టం వస్తే మొదటగా గుర్తుకొచ్చేది ఈ ఫౌండేషన్ సభ్యులు మాత్రమే. ఇదేదో ఊరికే చెబుతున్న మాట కాదు..

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తోంది. ఆయా డివిజన్లలో ఆయా పార్టీలు.. జాతీయ నాయకులతో కలిసి తిరగటం సంచలనంగా మారింది. గతంలో ఎప్పుడూ కూడా హైదరాబాద్ ఎన్నికలకు జాతీయ నాయకులు వచ్చింది లేదు.. ప్రచారం చేసింది లేదు. ప్రచారం జోరుగా సాగుతున్నా.. సైలెంట్ ఓటర్లను ఆకర్షిస్తూ.. గ్రౌండ్ వర్క్ చేస్తూ మిగతా పార్టీలను చెమటలు పట్టిస్తున్న డివిజన్లలో చందానగర్ ఒకటి.

ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా జెల్ల మౌలిక బరిలోకి దిగారు. అన్ని పార్టీలు నామినేషన్ వచ్చిన తర్వాత వస్తే.. టీడీపీ మాత్రం పదేళ్లుగా చందానగర్ డివిజన్ లో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ జనంలోనే ఉన్నారు. నామినేషన్ వేసినోళ్లు అభ్యర్థిని నేను అని పరిచయం చేసుకుంటుంటే.. టీడీపీ అభ్యర్థి మౌనికను మాత్రం ఓటర్లు బాగున్నారా.. మీరు వచ్చి ఓటు అడగటం ఏంటమ్మా.. మా ఓటు మీకే అని భరోసా ఇస్తున్నారు.

దీనికి కారణం నిర్మాణ్ ఫౌండేషన్. చందానగర్ డివిజన్ లోని ప్రతిగల్లీకి తెలిసిన పేరు ఇది. ఈ ఫౌండేషన్ అధ్యక్షురాలే జెల్ల మౌనిక. లాక్ డౌన్ సమయంలో వేలాది మందికి బియ్యం, పప్పులు, ఉప్పులతోపాటు మందులు పంపిణీ చేశారు. లాక్ డౌన్ ఉన్నన్ని రోజులూ పేదలకు ఆహారం అందిస్తూ కష్టకాలంలో అండగా నిలిచారు.

అంతెందుకు నిన్నటికి నిన్న కురిసిన భారీ వర్షాల వల్ల కైలాష్ నగర్, చందానగర్ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు ఆహారంతోపాటు దుప్పట్లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. డివిజన్ లో బాగా చదువుకునే విద్యార్థినీ విద్యార్థులకు ఆర్థికసాయం చేస్తూ వారి ఉన్నత చదువులకు ప్రోత్సాహం అందిస్తోంది నిర్మాణ్ ఫౌండేషన్. మిలియన్ డ్రీమ్స్ పేరుతో పేద విద్యార్థులకు అండగా నిలుస్తుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ముందుకు సాగుతుంది. పేద పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలనే లక్ష్యంతో వేలాది మందికి ఉచితం నోట్ బుక్స్, టెక్ట్స్ బుక్స్ అందించారు. అందిస్తూనే ఉన్నారు. పదేళ్లుగా నిర్మాణ్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు కూడా భవిష్యత్ లోనూ ఇంకా బాగా సాగుతాయని సభ్యులు ఎన్నోసార్లు రుజువు చేశారు.

ఇవన్నీ చేస్తుంది ఎవరో తెలుసా టీడీపీ అభ్యర్థి జెల్ల మౌనిక కుటుంబమే. డివిజన్ లోని పేదల ఇంట్లో కష్టం వస్తే మొదటగా గుర్తుకొచ్చేది ఈ ఫౌండేషన్ సభ్యులు మాత్రమే. ఇదేదో ఊరికే చెబుతున్న మాట కాదు.. దృశ్యంగా కనిపిస్తున్న వాస్తవం.. బాధితుల నోటి వెంట వచ్చే మాటలు. ఏమీ ఆశించకుండా, పదవులు లేకుండా ఇంత సాయం చేస్తున్నారు.. అదే కార్పొరేటర్ అయితే ఇంకెంత సాయం చేస్తారు.. గోరంత సాయాన్ని కొండంత చేయొచ్చు.. అవునా కాదా.. ఇదే ఇప్పుడు చందానగర్ డివిజన్ లో వినిపిస్తున్న ఓటర్ల మాట.. https://www.facebook.com/TeamNirmaan

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు