తిరుమల నిర్మానుష్యం.. వందల సంఖ్యకు తగ్గిపోయిన భక్తులు..

no devotees in tirupathi

కలియుగ దైవం.. ఏడుకొండల వైకుంఠ స్వామి.. వేకంటేశ్వరస్వామి దర్శనం అంటే ఎవరికి ఇష్టం ఉండదు.. నిత్యం లక్ష మంది భక్తులతో కళకళలాడిన తిరుమల కొండ.. మే 5వ తేదీ బోసిపోయింది. నిర్మానుష్యంగా మారింది. భక్తుల సంఖ్య భారీగా పడిపోయింది.

మే 5వ తేదీ నుంచి ఏపీలో 18 గంటలు లాక్ డౌన్, కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. ఈ క్రమంలోనే ముందుగానే 300 రూపాయల టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు సైతం.. చివరి నిమిషంలో తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. ప్రజారవాణాపైన ఆంక్షల ఉండటం.. తిరుమల కొండకు ఎక్కువగా వచ్చే తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ భక్తులు.. ఆంక్షల కారణంగా తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు.

కరోనా కేసులు పెరుగుతున్న సమయంలోనే సర్వదర్శనం టికెట్లను రద్దు చేసిన టీటీడీ.. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను సైతం 15 వేలకు తగ్గించింది. అయినా ఆ టికెట్లను బుక్ చేసుకోవటానికి భక్తులు భయపడుతున్నారు. రవాణా ఆంక్షలు, కర్ఫ్యూ, లాక్ డౌన్ వార్తల క్రమంలో భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

మే 5వ తేదీ తిరుమల కొండ నిర్మానుష్యంగా మారిపోయింది. రోజువారీగా వచ్చే భక్తులు 10 వేల మంది సైతం రాలేదు. తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులకు స్లాట్ బుక్ అయినా.. మధ్యాహ్నం వరకు 2 వేల మంది మాత్రమే స్వామివారి దర్శనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పడిపోయింది.

మరో రెండు వారాలు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంచనా వేస్తుంది టీటీడీ.. కొండపై హోటళ్లు, దుకాణాలు సైతం పదుల సంఖ్యలోనే తెరిచి ఉంటున్నాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు