కుర్రోళ్లకు నో ఫ్రీ వ్యాక్సిన్.. ఇదేందయ్యా కేసీఆర్ అంటున్న జనం.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫుల్..

telangana govenrment vaccination

భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సిన్ ప్రక్రియ సాగుతుంది. జూన్ 21వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన వారు అందరికీ ఉచిత వ్యాక్సిన్ వేయనున్నట్లు ప్రధానమంత్రి మోడీ ప్రకటించారు. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాలు 18 ఏళ్లు దాటిన కుర్రోళ్లకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫ్రీ వ్యాక్సిన్ వేయటం ప్రారంభించారు.

తెలంగాణ ప్రభుత్వం విచిత్రంగా.. 30 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఉచిత వ్యాక్సిన్ అని ఆన్ లైన్ లో చూపిస్తుంది. రాష్ట్రంలోని ఏ పిన్ కోడ్, జిల్లా కొట్టినా.. ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చే సెంటర్లలో 30 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే అని చూపిస్తుంది.

ఇదే సమయంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రం 18 ఏళ్ల వారికి వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నట్లు చూపిస్తుంది. ఇదెక్కడి విడ్డూరం అంటున్నారు కుర్రోళ్లు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వేల రూపాయలకు లభించే వ్యాక్సిన్లు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫ్రీగా ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు.

ఓ వైపు కాలేజీలు, స్కూల్స్, కోచింగ్ సెంటర్లు, హాస్టల్స్, మాల్స్, బార్లు, పబ్స్, థియేటర్లు, మాల్స్ ఇలా అన్నీ ఓపెన్ అయిపోయారు. కోచింగ్ సెంటర్లకు వెళ్లే వాళ్లందరూ 18 నుంచి 30 ఏళ్లలోపు వారే.. వాళ్లకే ఉచితంగా వేయలేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు స్టూడెంట్స్.

18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా ఇవ్వలేని.. అందుబాటులో లేని వ్యాక్సిన్లు.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 18 ఏళ్ల వారికి ఎలా అందుబాటులో ఉంటున్నాయని ప్రశ్నిస్తున్నారు యువత. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కరోనా సమయంలో.. ఇలాంటి వివక్ష వద్దని అంటున్నారు. అసలే ఆదాయం లేక.. ఉపాధి, ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో.. ప్రభుత్వం ఫ్రీ వ్యాక్సిన్లు ఇవ్వలేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

18 ఏళ్ల వారికి ప్రైవేట్ ఆస్పత్రుల్లో డబ్బులకు లభిస్తున్న వ్యాక్సిన్లు.. ప్రభుత్వానికి దొరకటం లేదా ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు