హైదరాబాద్ లో సభలు సమావేశాలు నిషేధం

తెలంగాణలో ఈ నెల 18 నుంచి 26 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ప్రతిపక్షాలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చే అవకాశం ఉన్న తరుణంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరో వైపు వేడుకలు కూడా జరిగే అవకాశం ఉండటంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో సభలు, ఊరేగింపులను నిషేధిస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కీలక ఉత్తర్వులు జారీచేశారు.

15వ తేదీ ఉదయం 6గంటల నుంచి 26 తేదీ సాయంత్రం వరకు అనగా అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకూ ఈ నిషేదాజ్ఞలు వర్తిస్తాయని కమిషనర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అసెంబ్లీ పరిసరాల్లో 4కి.మీ. పరిధిలో అనుమతి లేకుండా సభలు, ఊరేగింపులు నిర్వహించ కూడదని కమిషన్‌ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలను ఎలాంటి అంతరాయం లేకుండా, ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే ఈ నిషేదాజ్ఞలు అమలు చేస్తున్నట్టు తెలిపారు.

హైదరాబాద్ లో సభలు సమావేశాలు నిషేధం

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు