రెండు రోజుల్లో మాస్క్ జరిమానా రూ.17 లక్షలు – హైదరాబాదీలు బీ అలర్ట్

no mask fine in hyderabad
  • తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా ఫైన్స్
  • మాస్క్ పెట్టుకోకపోతే 250 నుండి 1000 వరకు జరిమానా
  • మాస్క్ రూల్స్ ఫాలో అవని షాపులకు 2వేల వరకు జరిమానా

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతుంది. ఈ క్రమంలోనే స్కూల్స్, కాలేజీలు, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్స్ మూసివేశారు. ప్రజల్లో మార్పు రాకపోతే విచ్చలవిడితనం వచ్చేసింది. మాస్క్ పెట్టుకోవాలన్న ఆలోచన మర్చిపోయారు. దీన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది.

మాస్క్ పెట్టుకోకపోతే ఫైన్ వేయటం మొదలుపెట్టింది. మాస్క్ డ్రైవ్ పేరుతో ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసింది. పట్టణం నుంచి పల్లె వరకు అన్ని ప్రాంతాల్లో మాస్క్ పెట్టుకోవాలని హెచ్చరిస్తోంది. మాస్క్ లేకుండా తిరిగే వాళ్లకు జరిమానాలు విధిస్తుంది. రెండు రోజుల్లోనే తెలంగాణలో 17 లక్షల రూపాయల జరిమానా విధించింది. మాస్కె పెట్టుకోకపోతే 250, 500, 750, వెయ్యి రూపాయల వరకు జరిమానా విధిస్తున్నారు. మాస్క్ లేకపోతే షాపులు, మాల్స్ లోకి రానివొద్దని హెచ్చరిస్తోంది. మాల్ లేదా షాపుల్లో మాస్క్ లేని వ్యక్తి కనిపిస్తే షాపు యజమానికి 2 వేల రూపాయల జరిమానా విధిస్తున్నారు.

ముఖ్యంగా హైదరాబాదీలు బీ అలర్ట్. ఎందుకంటే ఎక్కడ చూసిన జనమే.. వైన్ షాపులు, మాల్స్, సినిమా ధియేటర్లు, రైతు బజార్లు, ఫ్రూట్ మార్కెట్లు, బేకరీలు ఇలా ఎక్కడ చూసినా రద్దీనే.. మాస్క్ పెట్టుకపోతే సీసీ కెమెరా చూసి అయినా ఫైన్ వేస్తాం అని వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే 17 లక్షల రూపాయల ఫైన్స్ వేశారు.. అందులో మీరు ఉన్నారో లేదో తెలియదు కానీ.. మీ ఆప్తులు, మిత్రులు, చుట్టాలు, బంధువులు లేకుండా చూసుకోండి.. ఫైన్ కంటే కరోనా మరింత ఖతర్నాక్ కదా..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు