ప్రత్యేక పాసులు ఏమీ లేవు.. ఐడీ కార్డు చూపిస్తే చాలు.. మినహాయింపు లేని వారిపైనే కఠిన చర్యలు

no special pass needed

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. మే 12వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. దుకాణాలు బంద్ అయ్యాయి. అత్యవసర సర్వీసులు, వ్యాక్సిన్ వేయించుకోవాలనుకునే వారు.. ఆస్పత్రులకు కోసం వెళ్లే వారితోపాటు.. దాదాపు 30 సర్వీసులకు సంబంధించి ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది.

ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపులకు సంబంధించిన సంస్థలు, ఆఫీసుల్లో పని చేసే ఉద్యోగులు హ్యాపీగా తిరగొచ్చు. కాకపోతే వాటికి సంబంధించి వారి ఐడీ కార్డు చూపించాల్సి ఉంటుంది. ప్రత్యేక పాసులు అందరూ ఇవ్వటం లేదు పోలీసులు. ప్రభుత్వం కొత్తగా కొన్ని మినహాయింపులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో ఇంటర్నెట్, టెలికాం సేవలు ఉన్నాయి. మంగళవారం ఇచ్చిన ఆదేశాల్లో ఇవి లేకపోవటంతో.. బుధవారం కొత్తగా ఆదేశాలు ఇచ్చింది.

లాక్ డౌన్ సమయంలో తిరగటం కోసం కొందరు పాస్ తీసుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేసి అడుగుతున్నారంట. మరికొందరు పోలీస్ స్టేషన్లకు వచ్చి పాస్ కావాలని కోరుతున్నారు. ఇక్కడ ఓ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు పోలీసులు. ఆయా కంపెనీలు, సంస్థలు ఇచ్చే ఐడీ కార్డు చాలు అని.. ఆ ఐడీ కార్డు చూపిస్తే పోలీసులు ఆపరని స్పష్టం చేస్తున్నారు.

లాక్ డౌన్ మొదటి విడతలో 70 రోజులు పని చేశామని.. పూర్తి అవగాహన ఉందని చెబుతున్నారు పోలీసులు. ప్రస్తుతం బ్యాంకులు, ఏటీఎంలు, ప్రభుత్వ ఆఫీసులు 33 శాతంతోపాటు వ్యవసాయ పనులు, ఉపాధి హామీ పనులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని.. వారితోపాటు అత్యవసరం సేవల కింద మినహాయింపు ఉన్న వారు.. తమ ఐడీ కార్డు చూపించి వెళ్లిపోవచ్చు అంటున్నారు.

అనవసరంగా తిరిగే వారిపైనే కేసులు పెడతాం అని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని.. అవసరం అయితే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు