అడగనోళ్లు పాపం చేసుకున్నట్లే.. అందరికీ పదవులు పంచేసిన సీఎం జగన్

అడగనోళ్లు పాపం చేసుకున్నట్లే.. అందరికీ పదవులు పంచేసిన సీఎం జగన్

అడగనోళ్లు పాపం చేసుకున్నట్లే.. అందరికీ పదవులు పంచేసిన సీఎం జగన్

నామినేటెడ్ పదవుల భర్తీతో సీఎం జగన్ మరో హిస్టరీ క్రియేట్ చేశారనే చెప్పాలి. అడగనోళ్లు పాపం చేసుకున్నారు అన్నట్లు.. అడిగిన అందరికీ పదవులు ఇచ్చేస్తున్నారు. రెండేళ్ల కాలంలో హామీ ఇచ్చిన అందరికీ పదువులు ఇచ్చి.. ద్వితీయ శ్రేణి నేతలు అందర్నీ హ్యాపీగా చేయటం విశేషం.

గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. కార్పొరేషన్ పదవుల్లో సగం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వెళ్లిపోయేవి. దీంతో సెకండ్ క్యాడర్, ఓ మోస్తరు నేతలు అంతా పదవులు ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఈసారి జగన్ అందుకు భిన్నంగా ఆలోచించారు. ఒక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి సైతం కార్పొరేషన్ పదవులు ఇవ్వలేదు. అన్ని కార్పొరేషన్, బోర్డు పదవులను ద్వితీయ శ్రేణి నేతలకు కట్టబెట్టారు.

135 పోస్టులను ఒకసారి ప్రకటించటంతోపాటు.. అందులో 68 మంది మహిళలకు ఇవ్వటం అందర్నీ షాక్ కు గురి చేసింది. మగాళ్లకు 67 మాత్రమే ఇచ్చారు. ఇక ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 56 శాతం ఉండటం ఊహించని పరిణామం. గతంలో ఎప్పుడూ ఈస్థాయిలో సామాజిక ఈక్వేషన్స్ లేకపోవటం కొత్త రాజకీయాలకు అంకురార్పణ అనొచ్చు.

135 కార్పొరేషన్, బోర్డులు, సంస్థలకు చైర్మన్లను ప్రకటించటంతో అన్ని జిల్లాల్లోనే ద్వితీయ శ్రేణి నేతలు ఎంతో హ్యాపీగా ఉన్నారు. పార్టీని నమ్ముకుని ఉన్నందుకు న్యాయం జరిగిందంటున్నారు. గతంలో ఎమ్మెల్యేకు మాత్రమే పవర్ ఉండేది.. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలకు లెఫ్ట్, రైట్ హ్యాండ్స్ కు సైతం పవర్స్ వచ్చాయి. దీంతో జిల్లాల్లో నాయకత్వ సమస్య అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒకరు పోతే.. వారి వెనక ఇద్దరు, మగ్గురు నేతలు బలమైన నేతలుగా తయారుకావటానికి ఇది అవకాశంగా ఉంటుందని భావిస్తున్నారు నేతలు.

ద్వితీయ శ్రేణి నేతలకు పదవులు భారీగా దక్కటంతో టీడీపీలో సైతం లేకపోవటం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం అయ్యిందని ప్రత్యర్థి పార్టీ నేతలు, క్యాడర్ అనుకోవటం ఇందులో విశేషం.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు