సినిమా వాళ్ల ఏరియాలో టీఆర్ఎస్ ఓటమి – సుమ ఇంటర్వ్యూ వర్కవుట్ కాలేదు

సినిమా వాళ్ల ఏరియాలో టీఆర్ఎస్ ఓటమి - సుమ ఇంటర్వ్యూ వర్కవుట్ కాలేదు.. ఇవన్నీ తలకిందులు అయ్యాయి. సినీ ప్రముఖులు నివాసం ఉండే జూబ్లీహిల్స్, గచ్చిబౌలి డివిజన్లలోనే టీఆర్ఎస్ పార్టీ

జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత అత్యంత దూకుడుగా ముందుకు సాగింది. తమకు అత్యంత విశ్వాసంగా.. మద్దతు తెలిపే న్యూస్ ఛానల్స్ తమ పని తాము చేసుకుంటూ వెళ్లాయి. అది సరిపోదు అని భావించిన టీఆర్ఎస్ పార్టీ.. మహిళలను టార్గెట్ చేస్తూ మంత్రి కేటీఆర్.. ప్రముఖ బుల్లితెర నటి సుమతో ఇంటర్వ్యూ చేశారు. ఇది సూపర్ డూపర్ హిట్ అయ్యింది. బాగా అడ్వాంటేజ్ అవుతుందని భావించింది టీఆర్ఎస్ పార్టీ.

జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతే సినీ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున స్వయంగా ప్రగతిభవన్ వెళ్లి సీఎం కేసీఆర్ తో డిస్కషన్స్ చేసి వచ్చారు.

టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ అయితే సినీ ప్రముఖులతో మొక్కలు నాటించి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయించారు.

బుల్లితెర ప్రముఖ యాంకర్ సుమ ఇంటర్వ్యూ చూసినోళ్లు అయితే.. టీఆర్ఎస్ పార్టీకి ఫిదా అయిపోతారు.. ఓట్లు కుమ్మరించేస్తారు అని భావించారు.

ఇవన్నీ తలకిందులు అయ్యాయి. సినీ ప్రముఖులు నివాసం ఉండే జూబ్లీహిల్స్, గచ్చిబౌలి డివిజన్లలోనే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది.

ఓవరాల్ గా జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనే టీఆర్ఎస్ పార్టీ 56 సీట్లకు పరిమితం అయ్యింది. మేయర్ పీఠం కూడా దక్కించుకోలేకపోయింది. గత ఎన్నికల్లో 99 గెలిస్తే.. ఈసారి 56తో సరిపెట్టుకుంది.

టీఆర్ఎస్ ఓటమి తర్వాత సుమ ఇంటర్వ్యూ.. చిరంజీవి, నాగార్జున భేటీలే హాట్ టాపిక్ అయ్యాయి. స్వయంగా వాళ్లు ఉండే ఏరియాలోనే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవటం మామూలు విషయం కాదు కదా..

అంటే అన్నారు అంటారు కానీ.. సినిమా వాళ్లను చూసి అందరూ ఓటు వేస్తారా ఏంటీ అంటున్నారు సాధారణ ఓటర్లు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు